వామ్మో.. నిమ్మ తొక్క‌లతో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

Kavya Nekkanti

సాధార‌ణంగా నిమ్మతొక్కల నుంచి రసం తీయగానే వాటిని పడేస్తుంటాం. కానీ ఆ తొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నిమ్మకాయల్లో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయని అందరికీ తెలిసిందే. నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి, ఎ, కాల్షియం, ఫైబర్, పొటాషియంలు మనకు పోషణను ఇస్తాయి. పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అయితే నిమ్మకాయలే కాదు, వాటి తొక్క కూడా మనకు ఉపయోగకరమే. చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ, వస్తువుల్ని శుభ్ర పరచడంలోనూ ఎంతగానో తోడ్పడుతాయి. 

 

అలాగే నిమ్మకాయ తొక్కల్లో ఉండే D లైమొనెన్ అనే పదార్థం... గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించగలవని పరిశోధనల్లో తేలింది. నిమ్మ కాయ తొక్కలు... అధిక బరువును తగ్గించడమే కాదు... బీపీ కూడా కంట్రోల్ అవుతోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. నిమ్మకాయ తొక్కలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. మలబద్దకం, అల్సర్, గ్యాస్, అసిడిటీ ఉండవు. 

 

ద్రాక్ష పళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కంటే నిమ్మకాయ తొక్కల్లోనే ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయట. నిమ్మకాయ తొక్కను పీల్చితే చాలు ఆ వాసన వల్ల స్ట్రెస్ రిలీఫ్ కలుగుతుంది.  క్యాన్సర్‌లను అడ్డుకునే పవర్‌ఫుల్ ఔషధ గుణాలు నిమ్మకాయ తొక్కలో ఉంటాయి. మ‌రియు నిమ్మకాయ తొక్కలో ఉండే విటమిన్ సి దంతాలు, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగి.. రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: