కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు తెలుసా...?

Reddy P Rajasekhar

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను తలకు రాసుకుంటారు. కేరళలో మాత్రం కొబ్బరినూనెను వంటల్లో వినియోగిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం కొబ్బరినూనె ఉపయోగించి వంటలు చేస్తే శరీరానికి మేలు చేసే కొవ్వు పెరుగుతుంది. కొబ్బరి నూనెలో కే, ఈ విటమిన్లతో పాటు శరీరానికి మేలు చేసే మినరల్స్ కూడా ఉన్నాయి. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల అందంతో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 
 
సాధారణంగా వంటలలో ఉపయోగించే నూనె వల్ల గుండెజబ్బులు వస్తాయి. కానీ కొబ్బరినూనె వంటల్లో ఉపయోగిస్తే అందులో ఉండే లోరిక్ యాసిడ్ గుండె జబ్బులు రాకుండా సహాయపడటంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మాయిశ్చరైజర్ గా కొబ్బరినూనె ను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం, ముడతల పగుళ్లను కొబ్బరి నూనె నియంత్రిస్తుంది. 
 
తలకు కొబ్బరి నూనె రాస్తే జుట్టు బాగా పెరగడంతో పాటు పోషకాలు అందుతాయి. కొబ్బరి నూనె తో చేసిన వంటలు తింటే వేగంగా జీర్ణక్రియ జరుగుతుంది. కొబ్బరినూనె అజీర్తిని కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్ తో పోరాడుతుంది. కొబ్బరినూనె శరీరం వైరస్ ల భారీన పడకుండా రక్షిస్తుంది. కొబ్బరినూనెతో చేసిన వంటకాలు తింటే శరీర బరువు అదుపులో ఉంటుంది. ఎండోక్రైన్, థైరాయిడ్ గ్రంథులు సక్రమంగా పని చేయడానికి కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: