కరోనాపై పోరులో పండ్లు, కూరగాయలదే కీలక పాత్ర.... ఏమేం తినాలంటే....?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. వైద్యులు ప్రజలు కరోనా భారీన పడకుండా ఉండాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవడం మాత్రమే మార్గమని చెబుతున్నారు. కరోనా సోకినా సరైన ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. మనం రోజూ తినే ఆహార పదార్థాల్లో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.                         
 
విటమిన్ ఎ నుంచి యాంటీబాడీలు, యాంటీ జెన్ లు పుష్కలంగా లభిస్తాయి. చిలగడదుంప, క్యారెట్, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్, పాలకూర, గుడ్లు, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల ద్వారా విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. శరీరానికి హాని చేసే సూక్ష్మజీవులను సంహరించటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
 
బాదం, పిస్తా, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు, ఎండు కొబ్బరి, కరివేపాకు, శనగలు, పసుపు ద్వారా విటమిన్ ఇ లభిస్తుంది. కణాల మరమ్మత్తు కోసం, పునరుత్పత్తి కోసం విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. కూరగాయలు, జామ, మామిడి, దానిమ్మ, నిమ్మ, ద్రాక్షలు తీసుకుంటే శరీరానికి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బీ12 జీర్ణ వ్యవస్థను, నరాల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 
 
గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఎండు ద్రాక్ష, మాంసం, చికెన్, చేపల ద్వారా బి12 పుష్కలంగా లభిస్తుంది. అయితే కూరగాయలను అతిగా తీసుకున్నా, వేపుళ్లు ఎక్కువగా తిన్నా శరీరంలో విటమిన్లు నశిస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఎక్కువ మోతాదులో విటమిన్లు, మినరల్స్ , ఓమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాలు యాంటీబాడీస్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: