ఆరోగ్యం: కరోనా సమయంలో సపోటా తింటే ఏం అవుతుందో తెలుసా?
యమ్మీ.. యమ్మీగా ఉండే `సపోటా` ఇష్టపడని వారుండరు. అద్భుతమైన రుచిని కలిగి ఉండే సపోటా ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ తినగలిగే ఈ సపోటా పండులో.. మనిషి శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు దాగున్నాయి. తేలిగ్గా జీర్ణమయ్యే సపోటాలను తింటే.. తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపర్చడంతో పాటు చర్మాన్ని కూడా కాంతివంతంగా మారుస్తుంది.
అలాగే సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగాలతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే.. వైరస్ నుంచి రక్షించుకోగలమని నిపుణలు ఎప్పటికప్పడు చెబుతున్నారు. అందుకు ప్రతిరోజు పోషకాహారం తీసుకోవాలని.. అందులోనూ ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి ఫుడ్స్ డైట్లో ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాబట్టి, రోగనిరోధక శక్తిని పెంచే సపోటాలను ఖచ్చితంగా మీ డైలీ డైట్లో చేర్చుకుంటే మంచిది. ఇక పొట్టలో పుండ్లు, వాపు, నొప్పి,మంటలనూ సపోటా గ్రేట్‌గా పనిచేస్తుంది. అలాగే పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా, సపోటాలో కాల్షియం, పాస్ఫరస్, ఐరన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఒత్తిడి తగ్గించే గుణం కూడా సపోటాకు ఉంది. కాబట్టి, ఎప్పుడైనా ఒత్తిడిగా ఫీల్ అయినప్పడు ఒకటి, రెండు సపోటాపండ్లను తీసుకుంటే.. వెంటనే రిలీఫ్ పొందుతారు.