అల్లం, పసుపు ఆరోగ్యానికి ఎంత లాభమో చూడండి..

Purushottham Vinay

అల్లం, పసుపు.. వేరు నుంచి పుట్టినవే. రెండూ భూమిలోనే తయారవుతాయి. ఒకే తరహా కుటుంబానికి  చెందినవి. వీటిలో బోలెడన్ని ఔషద గుణాలు ఉంటాయి.ఇక అల్లం, పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి. పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.  మనం వండుకునే అన్ని వంటకాలలో పసుపుని కచ్చితంగా ఉపయోగించాలి. కరోనా వైరస్ నేపథ్యంలో వీటి వాడకం మరింత పెరిగింది. దగ్గు, జలుబు, దీర్ఘకాలిక నొప్పులు, మంట, కొవ్వు కరిగించే లక్షణాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. దీంతో బరువు తగ్గేందుకు ప్రయత్నించే చాలామంది.. పసుపు టీ, అల్లం టీలను తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఇవి శరీరంలో జీర్ణక్రియను పెంపొందించి వేగంగా బరువు తగ్గిస్తాయని నమ్ముతున్నారు. ఇక పసుపు విషయానికి వస్తే.. ఏ వంటలోనైనా సరే పసుపును తప్పనిసరిగా ఉపయోగిస్తాం. రుచి వగరుగా ఉన్నా.. రంగులో మాత్రం దీనికి తిరుగు ఉండదు. పసుపు మంచి యాంటీఆక్సైడ్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ‌గా పనిచేస్తుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది. అంతేగాక ఇందులో పోటాషియం, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, లినోలెనిక్ యాసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
పసుపు టీ కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే.. బరువును తగ్గించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. వేడి వేడిగా తాగే పసుపు టీ శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు క్రమబద్ధీకరిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమ్మాటరీ గుణాలు కొవ్వు కణాలను విస్తరింపజేస్తాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్.. ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తుంది. ఇది త్వరగా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.  ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.
ఇక అల్లం విషయానికి వస్తే.. ఇందులో ఉండే జింజెరోల్స్, షోగాల్స్ సమ్మేళనాలు శరీరంలో బరువు తగ్గేందుకు సహకరించే అనేక జీవసంబంధ కార్యకలాపాలను ప్రేరేపిస్తాయి. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మంట పుట్టించే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. గతేడాది జరిపిన పరిశోధనల్లో.. అల్లం తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తోందని తేలింది. అల్లానికి కాస్త నిమ్మకాయను కూడా కలిపితే.. మరింత సులభంగా బరువు తగ్గవచ్చట.
అలాగే అల్లం టీ తాగడం వలన దగ్గు, ఏమైనా గొంతు సమస్యలు రావు. కాబట్టి రోజుకి రెండు పూటలు అల్లం టీ తాగండి. దగ్గుతో బాధ పడేవారికి అల్లం టీ ఒక మంచి టానిక్ ల పని చేస్తుంది. కాబట్టి దగ్గు వున్న లేకపోయినా అల్లం టీ త్రాగడం అలవాటు చేసుకోండి.
అల్లం, పసుపులో జీవక్రియను పెంపొందించే సమ్మేళనాలు ఉన్నాయి. అలాగే కొవ్వును కరిగించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఒక వేళ రెండిటికీ న్యాయం చేయాలని అనుకుంటే ఒక వారం అల్లం టీ, మరో వారం పసుపు టీ ట్రై చేయండి. కాదంటే.. అల్లం టీకి కాస్త పసుపును చేర్చి తాగండి. అప్పుడు.. అల్లం, పసుపులోని పోషకాలన్నీ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: