విటమిన్ సి వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో చూడండి...!

Purushottham Vinay
విటమిన్ సి వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు వున్నాయి. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి. శరీరంలోని విటమిన్ సి స్థాయిలు ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. తక్కువ విటమిన్ సి స్థాయిలు ఉన్నవారు ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో భాధపడుతుంటారు. న్యుమోనియా ఉన్నవారు శరీరంలో తక్కువ విటమిన్ సి స్థాయిని కలిగి ఉంటారు మరియు విటమిన్ సి ఎక్కువగా తీసుకునే వారు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు త్వరగా రికవరీ అవుతారు.మీ చర్మానికి విటమిన్ సి మీ చర్మానికి సంబంధించినంతవరకు, విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేస్తుంది. ఇది చర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన భాగం. విటమిన్ సి చర్మానికి ఎక్కువగా అందితే ఇది ఒక యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి చర్మాన్ని డామేజ్ కాకుండా కాపాడుతుంది.

విటమిన్ సి గాయాలను త్వరగా నయం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.విటమిన్ సి మీ చర్మ సంరక్షణకు కావలిసిన యాంటీఆక్సిడెంట్‌ గా పని చెయ్యడమే కాకుండా ఇంకా చాలా విధాలుగా చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఇది మీ రోజు వాడే స్కిన్ కేర్ వస్తువుల్లో తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఎక్కువగా యాసిడ్ కంటెంట్ ఉండటం వల్ల కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీని వల్ల చర్మ సమస్యలు ఏవైనా దానికదే నయం చేసుకుంటుంది.

యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచడం, రక్తపోటును తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, అంటువ్యాధుల నుండి చర్మాన్ని రక్షించడం వంటి మరెన్నోగొప్ప ఆరోగ్య ప్రయోజనాలు విటమిన్ సి తీసుకోవడం వల్ల కలుగుతాయి. “విటమిన్ సి టాబ్లెట్స్ వేసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచే గొప్ప మరియు సరళమైన మార్గం. మీ ఆహారంలో ఈ యాంటీఆక్సిడెంట్ తక్కువగా ఉంటే వీటిని ఉపయోగించమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మీ రోగనిరోధక శక్తిని పెంచే సులభమైన మార్గాలలో ఒకటి విటమిన్ సి తీసుకోవడం. విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్, దీన్ని ఆహారం ద్వారా లేదా మందుల ద్వారా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: