ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. భూమ్మీద ప్రతి జీవానికి నిద్ర ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ప్రతి మానవుడు కూడా 6 నుంచి 8 గంటల పాటు నిద్రించాల్సిందే. నిద్ర వల్ల శరీరానికి నూతనోత్తేజం కలిగి కొత్త శక్తి వస్తుంది. ఇది మరుసటి రోజు పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. దీంతో మెదడు చురుగ్గా తయారై నూతనోత్తేజంతో పనులు చక్కబెడతాం. అయితే, నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాగా, వారి రోజూ వారి సమస్యల కారణంగా కొద్ది సమయం మాత్రమే నిద్రపోతుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి నిద్ర పోకుండా ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఈ సమస్య క్రమంగా ఆందోళనకు, భయానికి దారితీస్తుందని, ఇది క్రమంగా మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపించి చనిపోయే స్థితికి దారి తీస్తుందని తాజా పరిశోధన తేల్చింది.
నిద్ర లేమితో బాధపడేవారికి పోస్ట్ "ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్" (పిటిఎస్డి) వంటి భయంకరమైన వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని సైకియాట్రీ–కాగ్నిటివ్ న్యూరోసైన్స్ అండ్ న్యూరోఇమేజింగ్ జర్నల్ వారు అధ్యయనంలో రుజువు చేశారు. ఈ అధ్యయనంలో పేర్కొన్న దాని ప్రకారం ‘‘నిద్ర లేమి సమస్య క్రమంగా భయంతో పాటు మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. కాబట్టి, వ్యక్తులు పూర్తి స్థాయిలో నిద్రపోవడం మంచిది.లేకపోతే ఆ వ్యాధితో చాలా భయంకరంగా చనిపోతారు ”అని పరిశోధనా బృందం పేర్కొంది. కాబట్టి నిద్రను నిర్లక్ష్యం చెయ్యకండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
మరింత సమాచారం తెలుసుకోండి: