చలికాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ ఫుడ్ ని తీసుకోండి...
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని ఈ వింటర్ లో తీసుకుంటే మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ తీసుకున్నట్లే. బఠానీల్లో ఉండే ఫైబర్, పాలీఫెనాల్, ప్రోటీన్ వల్ల బఠానీలు తిన్న తరువాత ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది.అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వైరస్, బ్యాక్టీరియాని తరిమి కొట్టడంలో ఇమ్యూన్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తాయి. పరగడుపున అల్లం టీ లేదా అల్లం కషాయం తాగడం వలన ఎన్నో వ్యాధులకి దూరంగా ఉండవచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలపడుతుంది.బాదం పప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, రైబో ఫ్లావిన్, జింక్ వంటి పదిహేను న్యూట్రియెంట్స్ ఉన్నాయి. అంతే కాక పల్మనరీ ఇమ్యూన్ ఫంక్షన్ ని సపోర్ట్ చేసే యాంటీ ఆక్సిడెంట్ లాగా బాదం పప్పులో ఉన్న విటమిన్ ఈ పని చేస్తుంది.
విటమిన్ ఈ వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి కూడా ప్రొటెక్షన్ కలుగ చేస్తుంది. బాదం పప్పుని రోజులో ఎప్పుడైనా ఎలా అయినా తినవచ్చు. వీటిని ఎలాంటి ఫుడ్స్ లో అయినా కలిపి తీసుకోవచ్చు, ఎందుకంటే ఇండియన్ మసాలాలతో బాదం పప్పు తేలికగా కలిసిపోతుంది. మీకు నచ్చే స్నాక్స్ తయారీలో కూడా బాదం పప్పుని ఈజీగా కలుపుకోవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..