సపోటా వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...
సపోటాలో పిండిపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ అందిస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-A కంటికి చాలా మంచిది. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉన్నాయి. సపోటాలోని ఫైబర్లు మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి సంజీవనిలా పనిచేస్తుందట.
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటాకు సాటిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.సపోటాలో విటమిన్-B, C కూడా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.సపోటాలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టిగా ఉంటాయి. గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా మేలు చేస్తుందట.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...