శీతాకాలంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు తీసుకోవాల్సిన ఆహారం ఇదే!

kalpana
శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల అనేక రోగాలు వస్తుంటాయి. ఇందులో ముఖ్యమైనవి జలుబు,  దగ్గు, జ్వరం కీళ్ల నొప్పులు మొదలైనవి. ఇవి రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.శక్తి పెరగాలంటే ఆహార పదార్థాలు తీసుకోవాలి. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి పెంచు కోవడం వల్ల జలుబు, దగ్గు, కరోనా వైరస్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
ఉసిరికాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఉసిరిలో విటమిన్లు అధికంగా ఉంటాయి.ఈ రోజు ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబును దూరం చేయవచ్చు. అంతేకాకుండా కరోనా వైరస్ కు దూరంగా ఉండవచ్చు.         
శీతాకాలంలో ఎక్కువగా తృణధాన్యాలు,మొక్కజొన్న వంటివి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలంలోబయట పండినవి తినకుండా ఇంట్లో వండినవి తినడమే ఉత్తమం మనం తినే ఆహారంలో ప్రోటీన్, ఐరన్,  ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటివల్లబరువు తగ్గడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.                   
బెల్లంలో ఐరన్,మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల బెల్లం తినడం వల్ల చాలా రోగాలకు దూరంగా ఉండవచ్చు.వీలైనంతవరకూ తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. వీటితో పాటుబెల్లం కూడా తీసుకోవాలి.          
శీతాకాలంలో నెయ్యి తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నెయ్యిలో విటమిన్ ఏ, కె, ఇ ఉంటాయి.ఈ విటమిన్ వల్ల జుట్టు, చర్మము జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయి.కాబట్టి ఆహారంలో నెయ్యిని వాడాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: