ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చాలా మంది ఎసిడిటి సమస్యతో అష్టకష్టాలు పడుతుంటారు. ఆ సమస్యకి ఈ ఇంటి పద్ధతులు పాటించండి... కాఫీ, టీలకు దూరంగా ఉండండి.శీతలపానీయాల జోలికి అస్సలు వెళ్లొద్దు. హెర్బల్ టీ తాగితే ఎలాంటి సమస్య ఉండదు.రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగండి. ఆకలి వేసినప్పుడు పుచ్చకాయ, అరటి పండ్లు, దొసకాయలు తినండి. కొబ్బరి నీళ్లు ఎసిడిటీ నుంచి ఉపశమనానికి చాలా మంచిది. నిత్యం ఒక గ్లాస్ పాలు తాగండి.కారానికి దూరంగా ఉండండి. స్మోకింగ్కు దూరంగా ఉండండి.ఊరగాయలు, చట్నీలు, వెనిగర్ వంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది.రోజు ఉదయాన్నే పరగడపున పుదీనా ఆకులు నమలండి.భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని తీసుకోండి.భోజనం తర్వాత లవంగాలను బుగ్గలో పెట్టుకోండి.
దీనవల్ల ఎసిడిటీ సమస్య ఉండదు.లవంగాల్లో ఉండే కార్మెటివ్ గుణాలు జీర్ణాశయంలో ఆహారాన్ని త్వరగా కిందికి పంపిస్తాయి. ఎసిడిటీ ఉన్నవారు కొద్ది అల్లం తినొచ్చు. కానీ, మోతాదు మించితే మరో సమస్య వస్తుంది. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం నిమ్మ, బెల్లం, పెరుగు, అరటి పండు తీసుకోవచ్చు.ఎసిడిటీ బాధితులు బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, వెల్లులి, క్యారెట్, మునగ కాయలు తీసుకోవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
మరింత సమాచారం తెలుసుకోండి: