దొండకాయ ద్వారా డయాబెటిస్ ను చెక్ పెట్టవచ్చా!
దొండకాయను ప్రాంతాల వారీగా ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. అన్ని కాలాలలోనూ దొరికే దొండకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దొండకాయను చాలా మంది చాలా రకాలుగా వండుకొని తింటారు. కొంతమంది మజ్జిగలో వేసి ఎండబెట్టుకుంటే, మరికొంతమంది కూరచేసుకుని,అలా ఎవరికి నచ్చిన విధంగా వారు తయారుచేసుకొని తింటుంటారు.గ్రామాల్లో దాదాపు అందరి ఇంటి ఆవరణంతో పాటు పొలాల్లో కూడా విచ్చలవిడిగా ఈ దొండకాయ పండుతుంది. వీటికి నీరు పెద్దగా అవసరం పడదు. ఎక్కడైనా పండగల శక్తి దొండకాయ ఉంది
దొండకాయలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా దొండకాయ మొదటి పాత్ర వహిస్తుంది. అయితే దొండకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
దొండకాయ లో ఎక్కువగా ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి 1,విటమిన్ సి, క్యాల్షియం వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.దొండకాయలను వండుకొని తినడం వల్ల జలుబు, దగ్గు,ఊపిరాడకపోవడం లాంటి సమస్యల నుండి బయటపడవచ్చు అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియాను అడ్డుకుంటుందని వైద్యులు కూడా చెబుతున్నారు.
దొండ విత్తనాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలను తొలగించడమే కాకుండా, జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా కిడ్నీలలో రాళ్ళు పడకుండా ఆపగల శక్తి దొండ విత్తనాలకు ఉంది.దొండ ఆకుల రసాన్ని నీటిలో కలిపి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.దొండ కాయ తినడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. అంతేకాకుండా డయాబెటిస్ ను కూడా చెక్ పెట్టవచ్చు.దొండకాయను రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ముఖం మీద ముడతలు పోయి, ముఖం టైట్ గా తయారవుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న దొండకాయను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.