ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

kalpana
ప్రతి ఇంట్లోనూ ఉల్లిపాయలు కచ్చితంగా ఉంటాయి. ఈ ఉల్లిపాయలను ఎక్కువగా కూరల్లో వాడుతారు. ఉల్లిపాయలు గంధకం పాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి.ఉల్లిపాయలు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.వీటిని వేయించడం వల్ల క్యాలరీలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. విందు భోజనాల్లో పెరుగు, ఉల్లిపాయ చట్నీ తప్పనిసరిగా ఉంచుతారు.ఉల్లిపాయలు ఔషధ గుణాలు,  వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం..
 చెవి పోటు, మంట,  నొప్పి వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు,ఉల్లిపాయ ఉడికించి రసం తీసి చెవిలో రెండు చుక్కలు వేస్తే బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.ఇలా క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే ఇతర చెవి బాధలు తగ్గిపోతాయి.
 మూర్చ వ్యాధి ఉన్న వాళ్లకి ఉల్లిపాయ రసాన్ని తీసుకుని 2,3 చుక్కలు ముక్కులో వేయడం వల్ల వెంటనే కోలుకుంటారు.
 వేసవికాలంలో బయట తిరగాల్సి వచ్చినప్పుడు,రెండు లేదా మూడు ఉల్లిపాయలను తల మీద పెట్టుకొని టోపీ పెట్టుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
 ఉల్లిపాయలను చిన్నగా తరిగి పెరుగు కలిపి రోజు ఉదయం పూట తినడం వల్ల మూత్రపిండాలలోని రాళ్లు కరిగిపోతాయి.
పళ్ళు నొప్పిగా ఉండి, పళ్ల నుంచి రక్తం కారుతుంటే ఉల్లిపాయను పెద్దగా నూరి  పేస్టులా చేసి ఆ పేస్టును పళ్లపై పెట్టడం వల్ల పళ్ళు నొప్పి నయమవుతుంది.
 ప్రతిరోజు ఉదయం ఉల్లిపాయ రసం, తేన సమానంగా తీసుకొని వేడి చేసి తాగటం వల్ల వీర్యపుష్టి కలుగుతుంది.
 జ్వరము, దగ్గు,కడుపు నొప్పి, అజీర్ణం,అతిసార, ఆర్ష మొలలు వంటి వ్యాధులకు ఉల్లిపాయలు ఇతర అనుపానాలతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
 ఉల్లిపాయలు నుంచి రసం తీసుకొని రెండు తులాల నుంచి మూడు తులాల తాగించి మిగిలిన ఉల్లిపాయ ముద్దను పాము కాటు పై పెట్టడం వల్ల పాము విషం హరిస్తుంది.అలాగే తేలు విషం,పిచ్చి కుక్క విషం కూడా హరిస్తాయి.ఇంకా ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం కుట్టిన చోట రాయడం వల్ల మంట తగ్గుతుంది.
ఉల్లిపాయ రసాన్ని తలంతా మర్దన చేసి, ఇరవై నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.  ఇలా వారానికొకసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోయి. ఆరోగ్యంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: