కివి పండు ఉపయోగాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
కివి ఒక పక్షి పేరు నుండి కివి పండును గుర్తించగలిగారు అని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది ఏమో కివి పండు ని చూసి కివి పక్షిగా పేరు పెట్టారని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కివి పక్షి కివి పండు రెండూ చూడడానికి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. కివి పండు ముఖ్యంగా న్యూజిలాండ్ దేశంలోనూ, చల్లని ప్రదేశాల్లోనూ ద్రాక్ష పంట వలె సాగు చేస్తారు. ఇందులో ఉన్న పోషకాలు,విటమిన్లు మరే పండులోనూ లేవని నిపుణులు చెప్తున్నారు.
చూడడానికి సపోటా పండువలె కనిపిస్తుంది. కానీ గుడ్డు ఆకారంలో ఉండి,లోపల చూస్తే అనేక గింజలతో నిండిన ఆకుపచ్చ,పసుపు పచ్చని గుజ్జు ఉంటుంది. కివి పండులో ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం,ఫోలిక్ యాసిడ్, పీచుపదార్థం,యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ పుష్కలంగా లభిస్తున్నాయి. ఇ న్ని పోషకాలు కలిగిన పండు కాబట్టి దీనిని "వండర్ ఫ్రూట్" అని కూడా అంటారు. ఈ పండు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం
కివి పండును తింటే శరీరంలో రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రమాదం నుంచి బయట పడవచ్చు. కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె, మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలని ఆలోచించే వారికి కూడా కివి పండు ఎంతో మంచి ఫలితాన్ని అందిస్తుంది.కివి పండులో మాత్రమే కాకుండా కివి తొక్కలో కూడా కొన్ని పోషకాలు ఉన్నాయి. కివి పండు తొక్కలో లుయిటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా కివి పండు నుంచి తీసిన రసంలో చర్మ క్యాన్సర్ ను కాపాడే ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. విరేచనకారిగా, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో కివి పండు ఎంతగానో సహాయపడుతుంది.గుండెకు రక్తాన్ని బాగా సరఫరా చేయడానికి, కాలేయ క్యాన్సర్, రక్తనాళాల్లో గట్టి పదార్థం ఏర్పడకుండా కివి పండు సహకరిస్తుంది. క్యాన్సర్ కు దారితీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివి పండు లో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించే శక్తి కివి పండు కి వుంది . ప్రస్తుతం మన మార్కెట్లో ఆపిల్కి ఉన్నంత రేటు,కివి పండు కూడా ఉంది. ఇది మన దేశంలో సాగు చెయ్యరు,అయినప్పటికీ దీని రేటు మాత్రం ఆపిల్ రేటుకు సమానంగా ఉంది.