ఈ మొక్క ఔషధ గుణాల గూర్చి తెలిస్తే!! తప్పక ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటారు...

kalpana
భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సలో మునగ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మునగని  ఆహారంగా వివిధ రూపాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మునక్కాయలతో పాటు మున‌గ ఆకు, పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.
మునక్కాయలు మాత్ర‌మే కాక మున‌గ ఆకు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీనిలో  విటమిన్ సి, ఏ, మాంసకృత్తులు, ఇనుము,పొటాషియ ,పాస్ఫరస్‌ ,బీటా కెరోటీన్,అధికంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి.
తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో సిద్ధ వైద్యం , ఆయుర్వేదచికిత్సలో మునగాకునీ అనేక వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారు.ఈ ఆకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. మున‌గ ఆకును  ఆకుకూరలుగా ,ఆకుల్ని ఎండబెట్టి పొడిగా తీసుకుంటే అద్భుత ఫ‌లితాలు క‌లుగుతాయి.
మునగాకు లో ఉన్న ఔషధ గుణాల వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి , అధిక బరువు వంటి సమస్యలను దరిచేరనివ్వదు.ఆకులలో తక్కువ కొవ్వు, అధిక పోషక విలువలు ఉన్నాయి. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు.
చక్కెర వ్యాధితో బాధపడేవారు మునగాకును ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది తద్వారా చక్కెర వ్యాధిని అదుపులో ఉంటుంది.

మునగాకులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు అరుస్తుంది తద్వారా గుండె సమస్యలు తొలగుతాయి.
కడుపునొప్పికి కారణమయ్యే కడుపులో నులిపురుగులను నశింపజేయడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది.
మునగాకును ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవటంవల్ల  లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు మున‌గాకు ర‌సంలో కొద్దిగ లేతకొబ్బ‌రి నీరు పోసి క‌లిపి తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.
కంటి చూపు తక్కువగా ఉన్నవారు,రేచీకటితో బాధపడేవారు మునగాకు రసాన్ని తాగటం వలన మంచి పలితం ఉంటుంది.
ఇలా ఎన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని రక్షించే మునగాకును సర్వరోగ నివారిని అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: