ఈ పేస్ ప్యాక్ లు వాడి ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం చేసుకోండి..!

kalpana
అందంగా కనపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్లో దొరికే ఫేస్ ప్యాక్ లను కూడా వాడుతుంటారు.అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. పైగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎంత ఖర్చు చేసినా చర్మం మాత్రం అలాగే ఉంటుంది. కానీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 బంగాళదుంపను పేస్ట్ చేసి అందులోకి నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకొని ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.నలుపు పోయి తెల్లగా మారుతుంది. ఈ విధంగా నెలకి మూడుసార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.బంగాళదుంప లో బ్లీచింగ్ ఏజెంట్స్ అధికంగా ఉండటం వల్ల నలుపు దనాన్ని పోగొట్టి, తెల్లగా మారుస్తుంది.

 ముఖానికి పాలు వాడడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది. పాలన ఈ విధంగా వాడాలి. కాటన్ తీసుకుని పాలలో ముంచి ముఖానికి బాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గి, తెల్లగా మారుతుంది.

 ముఖము నలుపు గా ఉన్న, మచ్చలు ఉన్న, కలబంద ని వాడడం వల్ల నలుపు తగ్గడమే కాకుండా మచ్చలు కూడా తగ్గుతాయి. ఈరోజు నిద్రపోయే ముందు కలబంధ మొక్క నుండి కట్ చేసి జెల్లును ముఖానికి, మెడకు బాగా అప్లై చేయాలి ఉదయం లేవగానే కడిగేసుకోవాలి.

 కీరదోసకాయ రసం,తేనే కలిపి ఫేస్ ప్యాక్  తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి, మెడకు పట్టించాలి.ఇలా వారంలో ఒక రోజు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి కొట్టుకోవాలి. ఈ పొడి లోకి పాలు పోసి కొత్తగా పేస్టు మాధురి చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ముఖం,మెడనలుపు తగ్గి తెల్లగా మారతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: