తమలపాకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి....
రక్తప్రసరణకి సహకరించడమే కాకుండా తమలపాకులు మెటబాలిజంని కూడా వృద్ధి చేస్తాయి.శరీరంలో కఫం ఏర్పడకుండా చేసి తద్వారా దగ్గు రాకుండా చేస్తుంది తమలపాకు.ఇన్ ఫ్లమేషన్ తగ్గించి, కఫాన్ని కరిగించి బ్రాంకైటీస్‌తో బాధపడుతున్నవారికి సాంత్వన చేకూరుస్తుంది.కొబ్బరినూనెతో కలిపి దీన్ని కాళ్ళు, వీపు దగ్గర పట్టిస్తే నొప్పి, వాపు, మంట అన్నీ తగ్గుతాయి.మామూలు తలనొప్పికి గానీ, మైగ్రైన్ కి కానీ, తమలపాకులు బాగా పనిచేస్తాయి. నుదిటి మీద తమలపాకుల్ని రాయడం ఇష్టం లేకపోతే తమలపాకుల రసంతో మసాజ్ చేయొచ్చు.తమలపాకులు మెంటల్ అలర్ట్‌నెస్‌ని పెంచుతాయి. వీటిని తేనేతో కలిపి తీసుకుంటే అది టానిక్‌లా పనిచేస్తుంది.నీళ్ళెక్కువ వుండి కడుపు ఉబ్బరంగా అనిపిస్తే కాసిన్ని తమలపాకుల్ని చేత్తో నలిపి వాటిని పాలలో కలుపుకుని తాగితే మీ సమస్య చిటికెలో తగ్గిపోతుంది.
బ్లాక్ హెడ్స్, పింపుల్స్ - ఏవైనా తమలపాకుల రసాన్ని క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే అవి తగ్గిపోతాయి.కొబ్బరినూనెనీ తమలపాకురసాన్ని కలిపి చెవిలో వేస్తే చెవినొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.డియోడరెంట్స్ పక్కనపెట్టి తమలపాకు రసాన్ని తీసుకోండి.చెమట వాసన తగ్గించడంలో దీన్ని మించింది లేదు.తమలపాకు నాచురల్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. ఓరల్ హైజీన్‌ని కాపాడుతుంది. చిగుళ్ళని బలోపేతం చేసి దంతక్షయాన్ని నివారిస్తుంది.తమలపాకుల్లో ఉండే యాంటీ-ఫంగల్, యాంటీ-సెప్టిక్ గుణాల వల్ల మలేరియా లాంటి వ్యాధులు రాకుండా చేసే అవకాశముంది.