ప్రపంచానికి సవాల్‌గా కొత్త క్యాన్సర్ ... లక్షణాలు ఇవే...!
ఇక థైరాయిడ్ గ్రంధి విషయానికి వస్తే ఇది ప్రతి మనిషికి మెడ భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి హోర్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే గత మూడున్నర దశాబ్దాల కాలంలో ఎక్కువ మంది థైరాయిడ్ ప్రభావానికి లోనవుతున్నారు. ఇక ప్రస్తుతం 35 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఈ థైరాయిడ్ క్యాన్సర్ భారీన పడుతున్నట్టు నివేదికలు చెపుతున్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చేందుకు చాలా కారణాలే ఉన్నాయి. అయితే వీటిల్లో ప్రధానమైంది.. అయెడిన్ ఎక్కువుగా ఉండే ఫుడ్ తీసుకోవడంతో పాటు.. మనిషిలో రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉండడం కూడా ఓ కారణమే అట.
ఇక ఎక్కువ మంది తీసుకునే రేడియేషన్ చికిత్స కూడా థైరాయిడ్ క్యాన్సర్‌కు మరో కారణం అంటున్నారు. ఇక మనిషిలో వంశ పారంపర్యంగా వచ్చే జన్యుపరమైన కారణాలు కూడా ఈ క్యాన్సర్‌కు మరో కారణం అని టాక్ ? ఇక ఈ వ్యాధి లక్షణాల్లో ప్రాధమికంగా ముందుగా మెడ వాపు కనపడుతుంది. ఆ తర్వాత కొంత కాలానికి ఆహారం మింగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత ఇది ముదురు తుంది. దీనిని ముందుగా గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అట. ఇక ఈ థైరాయిడ గ్రంథికి క్యాన్సర్ సోకితే గ్రంథిని పూర్తిగా తొలగించాలని చెపుతున్నారు. దీనిని బట్టి థైరాయిడ్ గ్రంథి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.