చెరుకు రసం లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ఉన్నాయని మీకు తెలుసా...?

kalpana
 చెరకు నుండి తీసే రసం చాలా తీయగా, రుచిగా ఉంటుంది.అందుకే ఇష్టంగా తాగుతారు. ఎక్కువగా  దాహం వేసినప్పుడు చల్లని నీటిని తాగే బదులు చెరుకు రసం తీసుకోవడం వల్ల దప్పిక తీరుతుంది.నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చెరుకు రసం తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది.చెరుకు రసం తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది.రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం...                                               
 కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వాళ్లు చెరుకు రసం తీసుకోవడం వల్ల కొంతమేరకు ఉపశమనాన్ని పొందవచ్చు.
 మధుమేహ వ్యాధి ఉన్న వాళ్లు కూడా చెరుకు రసం తీసుకోవచ్చు. ఎందుకంటే చెరుకు రసం లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.కాబట్టిమధుమేహం ఉన్న వాళ్లు కూడా చెరుకు రసం తీసుకోవచ్చు. దీనిలో సుక్రోజ్ ఉండటం వల్ల దంతక్షయాన్ని కూడా నిర్మూలిస్తుంది.
 చెరుకు రసం లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తాయి. వాటితో పాటు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి.
 చెరుకు రసం లో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉండటం వల్ల కడుపులో మంట, అసిడిటీ సమస్యలు తగ్గడానికి సహాయపడుతాయి.
 చెరకు రసం తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి,ఫ్లూ వంటి వాటిని తగ్గిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
 చెరకు రసంలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలకు, దంతాలకు చాలా మంచిది.చిన్న పిల్లల ఎదుగుదలకు చెరుకు రసం చక్కగా ఉపయోగపడుతుంది.
 చెరకు రసంలో మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్,  క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల స్పోర్ట్స్ లో ఆటలాడి అలసిపోయిన వారికి ఈ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: