ఎండు ద్రాక్షాతో క్యాన్సర్, రక్తహీనత వ్యాధులు దూరం....
ఎండు ద్రాక్షలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు గట్టిపడతాయి. ఎండుద్రాక్ష రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎండు ద్రాక్షను నోట్లో వేసుకుని నమిలితే దుర్వాసన సమస్య ఉండదు. ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్స్ ఆకోగ్యానికి చాలా మేలు చేస్తాయి.కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎండు ద్రాక్ష మంచిది.ఎండు ద్రాక్షతో బరువు తగ్గవచ్చు. వీటిని కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన అనుభవం కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువ తింటారు.ఎండు ద్రాక్ష క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఎండు ద్రాక్ష కాపాడుతుంది. పిల్లలకు రోజూ ఉదయాన్నే వీటిని తినడం అలవాటు చేయండి.ఎండు ద్రాక్షను చలికాలంలో తీసుకోవడం చాలామంచిది. దీనివల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎండు ద్రాక్ష జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో కూడా అనే రోగాల మందులకు ఎండుద్రాక్ష వినియోగిస్తారు.
ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషాలున్న వారికి ఎండుద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం పనితీరుకి ఇవి చాలా మంచివి.ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేనివాళ్లకి ఎండుద్రాక్ష ఎంతో ఉపయోగకరం. ఎండు ద్రాక్ష తినడం వల్ల సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.ఇవి మెదడుకీ మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి. ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం, కెటెచిన్లు, విటమిన్-Cలు ఆర్ధరైటిస్‌తో బాధపడేవారికి మేలు చేస్తాయి.ఇందులోని ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..