శీతాకాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా?అయితే ఈ చిట్కాలు పాటించండి!!
చలికాలం వాతావరణం చల్లగా ఉండడంతో తలస్నానానికి బాగా వేడినీళ్లు వాడుతుంటారు. అది పొరపాటే వేడి నీళ్లు వాడటం వల్ల మాడుపై చర్మం పొడిబారి చుండ్రు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తలస్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడాలి.
ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి ముద్దగా నూరి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది
వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేసిన తర్వాత గోరువెచ్చని నూనె తలకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి
మా ఇంట్లో దొరికే అల్లం ను చిన్న ముక్కలుగా తరిగి నువ్వుల నూనెతో మరిగించి, గోరువెచ్చగా తయారైన తర్వాత మృదువుగా కుదుళ్లకు అంటించాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య దరిచేరదు. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచిది.
కలబంద చర్మ సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కావున ఈ కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగడంతో పాటు అందమైన, మృదువైన వెంట్రుకలు మన సొంతం అవుతాయి.
పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.