చిలగడ దుంపలను ఆహారంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా!!
చిలగడదుంపలో అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధకశక్తి పెంపొందుతుంది తద్వారా ప్రమాదకర ఫ్లూ, జలుబు వంటి వ్యాధులను దూరంగా ఉంచవచ్చు.
చిలగడ దుంప లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.
చిలకడదుంప లో ఉండే కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్ మన శరీరంలో ఏ విటమిన్ ప్రేరేపిస్తాయి. తద్వారా కంటి చూపు సమృద్ధిగా ఉండి, కంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
చిలగడదుంపలు మన శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందిస్తాయి. కావున కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
చిలగడదుంప లో ఉండి పిండి పదార్థం మనకు తక్షణ శక్తిని అందిస్తుంది. అందువల్లే క్రీడాకారులు వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకోమని చెబుతుంటారు.
చిలగడ దుంపలలో ఉండే అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్ క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇవి మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
విటమిన్ D అధికంగా ఉండడం వల్ల చిలగడ దుంపలు ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలను కూడా ప్రోత్సహిస్తాయి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు చిలగడదుంప ఔషధం వంటిది. తక్కువ మోతాదులో గ్లైకమిక్స్ ఇండెక్స్ కలిగే ఉండే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.