కళ్ళకింద నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..?

Divya

ముఖాన్ని అందంగా తీర్చి దిద్దుకోవడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములు వాడి, ముఖాన్ని అందంగా మార్చుకుంటుంటారు. కానీ ముఖం మీద , కళ్ళ చుట్టూ నల్లటి వలయాల లాగ ఏర్పడి,చూడడానికి అందహీనంగా కనిపిస్తుంటారు. అయితే వీటికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని,వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ నల్లటి మచ్చలను ఎలా తగ్గించుకోవాలో? ఇప్పుడు చదివి తెలుసుకుందాం.


నల్ల మచ్చలు ముఖ్యంగా నిద్రలేమితో బాధపడుతున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఎక్కువగా మేల్కొన్నప్పుడు ఈ నల్లటి మచ్చలు కళ్ళ చుట్టూ  ఏర్పడి, చూడడానికి అందవిహీనంగా ముఖాన్ని మారుస్తాయి . ఇందుకోసం సిట్రిక్  యాసిడ్ గుణాలు కలిగిన చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మసౌందర్య సాధనంగానూ  ఉపయోగపడుతుంది.  చింతపండు రసాన్ని ముఖానికి రాసుకొని కాసేపటి తర్వాత,చల్లని నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

చింతపండు,పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జులా చేసుకొని,ముఖానికి రాసుకోవాలి. అంతేకాకుండా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడిన ప్రదేశంలో, కాటన్ బాల్  తీసుకొని  ఆ మిశ్రమంలో అద్ది, సుతిమెత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది.  ఆ తరువాత పది నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మం పైన ఉన్న నల్ల మచ్చలు, కంటి కింద ఏర్పడే నల్లని వలయాలు కూడా పోయి,ముడతలు కూడా తగ్గుతాయి.అయితే ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు పాటిస్తే, మంచి ఫలితం ఉంటుంది.


 కీర దోసకాయలు కూడా నల్లటి మచ్చలను తొలగించడానికి ఎంతో దోహదపడతాయి. గ్రీన్ టీ బ్యాగులు కూడా వేడినీళ్ళల్లో అద్ది,గోరువెచ్చగా ఉన్నప్పుడు కళ్ళ కింద పెట్టుకోవడం వల్ల కూడా మచ్చలు తగ్గి, కళ్ళకు తగినంత తేమ అందడంతో పాటు తాజాగా నిగనిగలాడుతూ ఉంటాయి.


టమోటా ముక్క పై కొద్దిగా చక్కెర వేసి, కళ్ళకింద సుతిమెత్తగా మర్దనా చేయడం వల్ల కూడా నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి.

పైన పేర్కొన్న పద్ధతులను పాటించి కళ్ళకింద నల్లటి మచ్చలను తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: