బట్టలకు సంబంధించినవి కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి...!

kalpana
బట్టలకు రక్తము, సిరా వంటి మరకలు అయినప్పుడు వాటిని పోగొట్టడానికి ఉప్పు నీటిలో నానబెట్టి ఉతకాలి. ఆ తర్వాత వేడి నీటిలో జాడిస్తే మరకలు పోతాయి.                                             

 బట్టలు రంగు పోకుండా ఉండాలంటే,  బట్టలు నీళ్లలో నానబెట్టి ముందు ఆ నీళ్లల్లో కొంచెం వెనిగర్ కలిపితే రంగు పోకుండా మెరుస్తూ ఉంటాయి.

 తెల్లని నూలు బట్టల పై తుప్పు మరకలు పడితే ఆ మరక లపై నిమ్మరసం, ఉప్పు రాసి రెండు గంటలు ఎండలో ఎండబెట్టి తర్వాత ఉతకాలి. తుప్పు మరకలు లేకుండా పోతాయి.

 తెల్ల బట్టల మీద కూర మరకలు పడితే మరక లపై తెల్లని టూత్ పేస్ట్ రాసి నీటిలో నాన బెట్టాలి. కొంత సమయం తర్వాత  ఉతకాలి.

 నారింజ తొక్కలను బాగా ఎండబెట్టి బట్టల మధ్య ఉంచితే పురుగులు కొట్టకుండా ఉంటాయి.

 గోరింటాకు మరకలు బట్టలపైన పడినప్పుడు వాటిని తొలగించడానికి నిమ్మ తొక్కతో రుద్దితే మరకలు పోతాయి.

 షర్ట్ కాలర్ పై వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త షాంపు వేసి నానబెట్టి ఆ తర్వాత ఉతికితే మురికి పోతుంది.

 కొత్త బట్టలు,సిల్కు బట్టలు ఉతికేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే బట్టల మృదత్వం, రంగు పోకుండా ఉంటాయి.

 జీన్స్ రంగు మారకుండా ఉండాలంటే అర బకెట్ నీళ్లలో 4 టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి.

 గంజి పెట్టిన గుడ్డలను ఐరన్ చేసేటప్పుడు అత్తుకు పోకుండా ఉండడానికి ఐరన్ బాక్స్ అడుగుభాగాన పారా పిన్ రాస్తే అత్తుకు  పోకుండా ఉంటాయి.

 ఒక టేబుల్ స్పూన్ నిమ్మ చెక్కల పొడిని వాషింగ్ పౌడర్ తో కలిపి బట్టలు ఉతికితే బట్టలు తెల్లగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: