మీరు ఇలాంటి లక్షణాలతో బాధ పడుతున్నారా!! అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

kalpana
శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు
(కిడ్నీలు). మూత్రపిండాలు శరీరంలోని రక్తాన్ని శుద్దిచేసి, ప్రమాదకర, విసర్జన పదార్థాలను నీటితో కలిపి మూత్రం ద్వారా  బయటకు పంపిస్తాయి. ఆరోగ్య వంతమైన మనిషి మూత్రపిండాలు రోజుకు దాదాపుగా 200 లీటర్ల నీటిని శుద్ధి చేయగలవు. మూత్రపిండాలు ఎంత ఆరోగ్యవంతంగా పని చేయగలిగితే మనిషి అంత ఆరోగ్యవంతంగా జీవితాన్ని గడపగలరు. కానీ మారుతున్న కాలానుగుణంగా చిన్న వయసులోనే అనేకమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కిడ్నీ వ్యాధులకు అనేక కారణాలు కావచ్చు అయినా వాటిని త్వరగా గుర్తించగలిగితే సరైన చికిత్సా పద్ధతులు పాటించి , కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చు.
ముఖ్యంగా డ‌యాబెటీస్ ఉన్న వారు త‌ప్ప‌ని స‌రిగా ప్ర‌తి ఆరు నెల‌లు  ఒకసారి మూత్రపిండాన్ని కి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవడం ఉత్తమం .
మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ముఖం, కాళ్లు చేతులు వాచినట్లు కనిపిస్తాయి.
మూత్రపిండాల వీధి సక్రమంగా నిర్వర్తించ లేకపోతే వ్యర్థాలు రక్తంలో చేరి అనేక వ్యాధులకు కారణమైన నోటి దుర్వాసన, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు.
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఆ ప్రభావం వల్ల శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనత వస్తుంది. దీంతో తీవ్రమైన అలసట ఉంటుంది. ఈ సమస్య ఉన్నా స్పందించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి
తరచూ తలనొప్పి, నడుము నొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు బాధపడుతూ ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది.
మూత్రం సాధారణంగా కాకుండా రంగుమారి వస్తుంటే తప్పనిసరిగా కిడ్నీ సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మూత్రపిండంలో రాళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా కనబడే లక్షణం  పొత్తి కడుపులో తిమ్మిరి నొప్పి లక్షణం కనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి.
ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంకా ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె పోటు వంటి వ్యాధులతో దీర్ఘకాలంపాటు బాధపడాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: