ఎక్కిళ్ళను చిటికెలో తగ్గించే చిట్కా ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా మన పెద్ద వాళ్లు మనకు ఎక్కిళ్ళు వస్తే, మనల్ని బాగా ఇష్టపడేవారు తలచుకుంటున్నారు అని అంటుంటారు.. కానీ అందులో ఎంత నిజముందో తెలియదు కానీ,విపరీతంగా ఆగకుండా ఎక్కిళ్ళు వస్తే మాత్రం, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధారణంగా రోజువారి పనిలో ఉన్నప్పుడు అసందర్భంగానూ, అనుకోకుండా గొంతును ఒక పట్టాన నిలవ నీయకుండా పదేపదే ఎక్కిళ్ళు వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా రావడం వల్ల గొంతు నుండి శ్వాసకు, శ్వాస నుండి  ఊపిరితిత్తులకు అటు నుండి గుండె ఇవన్నీ కూడా ఎక్కిళ్ల వల్ల ప్రభావితం అవుతాయి. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు గుండె మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.


సాధారణంగా మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి అంటే, ఊపిరితిత్తుల్లో ఉండే ఫ్రీనిక్, వేగస్ అనే నాడీలు, హైపోథాలమస్ అనే మెదడు భాగం, గొంతుకు సంబంధించిన కొన్ని కండరాలు అన్నీ కలిపి ఎక్కిళ్లు కు కారణమవుతాయి  . మాములుగా వచ్చే ఎక్కిళ్ళు తొందరగా తగ్గిపోతుంటాయి. కాని కొంతమందిలో చిన్నగా మొదలయ్యి,వారాల తరబడి వేధిస్తూనే ఉంటాయి. వీటికి కావలసిన చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బార్లీ గింజలను ఉడికించి, పెరుగు వేసి బాగా చిలికితే పల్చటి మజ్జిగలా అవుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా మానిపోతాయి. మరమరాలు, పేలాలు, బిర్యానీ ఆకు, వెలగ చెట్టు ఆకుల రసం ఇవన్నీ కూడా ఎక్కిళ్ళను తగ్గిస్తాయి. ధనియాలు,జీలకర్ర, అల్లం ఎండిన ముక్క ఈ మూడింటిని ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకొని,  కొత్తగా పొడి చేసి అందులో తగినంత ఉప్పు కలిపి నిల్వ చేసుకోవాలి. ఇక ఎక్కిళ్ళు ఆగకుండా వేధిస్తున్నట్లు అయితే ఈ పొడిని కొద్దిగా పల్చటి మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.


ఈ మధ్య కాలంలో చాలా మంది త్వరగా జబ్బుల బారిన పడుతున్నారు. ఆ జబ్బులు కూడా ఎక్కిళ్ళకు కారణం కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ నూనె పదార్థాలు ఉండటం లేదా పులుపు కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కిళ్లు వస్తాయి. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు శ్వాసనాళం లో గాలి చొరబడడం కూడా ఒక కారణం కావచ్చు. ఆల్కహాల్,ధూమపానం ఇవి కూడా ఎక్కిళ్ళకు కారణం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: