భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.. లేకపోతే పరమ దరిద్రం...!

kalpana
 మన పెద్దల కాలంలో భోజనం చేయాలంటే ఎన్నో నియమాలు, పద్ధతులు పాటించేవారు. అలా  చేయడంవల్ల తిన్న ఆహారం వంటికి పడుతుందని పెద్దలు చెబుతుండేవారు. కానీ ఇప్పుడు భోజనం చేయాలంటే  టీవీ, సెల్ ఫోన్ వంటి వాటిని చూస్తూ చేస్తుంటారు. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు చాలామంది మంచాల పైన చేస్తుంటారు ఇలా చేయకూడదని పెద్దలు చెప్పినా కూడా వినరు. ఈ విధంగా చేయడం వల్ల పరమ దరిద్రం అని పండితులు చెబుతారు. అన్నము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని మనకు తెలుసు అందుకే అన్నాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలనే పండితులు చెబుతున్నారు. అయితే భోజనం చేసేటప్పుడు ఎలాంటి  నియమాలు పాటించాలి. అవి పాటించడం వల్ల ఏమి జరుగుతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 భోజనం చేసే ముందు కాళ్లు, చేతులు  శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాకుండా భోజనం తినేటప్పుడు తూర్పు వైపు గాని, ఉత్తరం వైపు గాని కూర్చొని తినడం చాలా మంచిది. అలాగే భోజనం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా లేదా పిలిచినా కూడా పైకి లేవకూడదు.
 భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి ఎంగిలి చేత్తో మరొకరికి  వడ్డించ రాదు . అలాగే నిలబడి అన్నం తినరాదు. అలా చేయడం వల్ల పరమ దరిద్రులు అవుతారు.
 భోజనం చేసేటప్పుడు అన్నం ప్లేట్ ను వడిలో  పెట్టుకుని భోజనం తినకూడదు. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు కూరలు బాగా లేవు, మనం సరిగా లేదు అనే మాటలను మాట్లాడకూడదు.
 భోజనం చేసేటప్పుడు కొంతమంది గిన్నెలను ఖాళీ చేస్తూ ఉంటారు. చేయకుండా ఈ గిన్నెల్లో కొంచమైనా భోజనం ఉండనివ్వాలి. అంతేకాకుండా వండిన  ఆహార పదార్థాలను మరీ మరీ వేడి చేయకూడదు.
 భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలి. అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకుంటూ చేయడం మంచిది. అలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం శరీరానికి బాగా వంట పడుతుంది. ఈ నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: