ఈ చిట్కాలు పాటిస్తే, ఎంత మొండి జలుబు అయినా మటాషె...!
జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు అల్లంతో టీ తయారు చేసుకునే రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవడం వల్ల జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.
పసుపుకొమ్ములు తెచ్చి వాటిని కాల్చి వాటి నుండి వచ్చే పొగను పీల్చుకోవడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.
జలుబుతో బాధపడుతున్నప్పుడు అర చెంచా మిరియాల పొడి, ఒక చెంచా బెల్లం పొడి ఒక కప్పు నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. గోరు వెచ్చగా అయిన తర్వాత కొద్దికొద్దిగా తాగుతుంటే జలుబు నుండి విముక్తి పొందవచ్చు.
పసుపు కొమ్ముల నుండి పసుపు తయారు చేసుకొని ఒక కప్పు పాలలో అర స్పూన్ పసుపు పొడి వేసి రోజు రెండు మూడు సార్లు తాగడం వల్ల జలుబు తగ్గుతుంది.
జలుబు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వేడివేడిగా వెజిటబుల్ సూప్ తయారు చేసుకొని అందులోకి పెప్పర్, సాల్టు వేసుకొని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల జలుబు సమస్య తగ్గుతుంది.
ఒక కప్పు నీళ్ళు తీసుకొని అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఉడకనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీరు త్రాగడం వల్ల జలుబు తగ్గుతుంది.
తులసి ఆకులతో డికాషన్ తయారు చేసుకొని రోజుకు రెండు మూడు సార్లు తాగడం వల్ల జలుబు నుండి ఉపశమనం.