జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే, తలస్నానానికి ముందు ఇలా చేయాలి...?

kalpana
తలస్నానం చేసేటప్పుడు జుట్టుకు ఆయిల్ మాత్రమే పెట్టుకుంటే సరిపోదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగానూ, అందంగానూ ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు తెల్లబడటం, జుట్టు నిర్జీవంగా మారడం డ్రై గా మారడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకే తలస్నానానికి ముందు ఎలాంటి  చిట్కాలు పాటిస్తే  జుట్టు అందం రెట్టింపు పెరుగుతుందో ఇప్పుడు కలుసుకుందాం...                                    

 తలస్నానానికి ముందు గోరువెచ్చని నూనెతో తల బాగా మసాజ్ చేయాలి. కొద్దిసేపు తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు మెరవడం మే కాకుండా,  ఆరోగ్యంగా పెరుగుతుంది.

 ఆలివ్ ఆయిల్, చమురు కలిపి ఇందులోకి విటమిన్ ఇ టాబ్లెట్ లు కూడా  మిక్స్ చేసి తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టుకు రాసిన తర్వాత కనీసం 20 నిమిషాల సేపు ఉండాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 తలస్నానం చేయడానికి వేడి ఎక్కువగా ఉన్న వాటర్ ని వాడకూడదు. ఎందుకంటే జుట్టు పొడిబారుతుంది. అంతేకాకుండా రఫ్ గా మారుతుంది.

 తలస్నానం చేసే ముందు పెరుగు, గుడ్డులోని సొన కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా జుట్టు అందంగా, షైనింగ్ గా మారుతుంది.

 3 టేబుల్ స్పూన్లు మినుములను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి. అందులోకి ఒక గుడ్డు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ  మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో బాగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: