నిజానికి భోజనం చేసేటప్పుడు, భోజనం చేసిన తర్వాత ఎంతసేపటికి నీటిని తాగాలో తెలుసా..!

Divya

నీరు మన శరీరానికి  ఎంతో అవసరమని అందరికీ తెలిసిందే . నీరు మన జీవనాధారం . నీటిని తాగడం వల్ల మన శరీరంలో జీవక్రియలు సరిగా జరుగుతాయి . అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగు పడి , దాని పనితీరు వేగవంతమవుతుంది. అంతేకాకుండా రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సూచిస్తుంటారు . అంతకన్నా తక్కువ నీటిని తాగడం వల్ల  శరీరంలోని తేమ శాతం తగ్గిపోయి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది . అలాంటి నీటిని తప్పనిసరిగా   మన జీవన విధానం లో చేర్చుకోవాలి.


సాధారణంగా మనలో కొంత మంది భోజనం చేసేటప్పుడు పక్కన నీళ్ల గ్లాసు కంపల్సరి గా ఉండాల్సిందే.  మరికొంతమంది భోజనం ముగిసే వరకూ నీటిని తాగరు. అయితే మనలో చాలామంది భోజనం తిన్నాక,ఎంతసేపటికి నీటిని తాగాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నిజానికి ఆహరం తీసుకున్నాక ఎంత సేపటకి నీటిని తాగాలో..? ఎప్పుడు నీటిని తాగకూడదో..? ఇప్పుడు  ఇక్కడ మనం చదివి తెలుసుకుందాం..


భోజనం చేసే అరగంట ముందు మాత్రమే నీటిని తీసుకోవాలి. ఇక భోజనం చేసిన 30- 40 నిముషాల తరువాత మాత్రమే నీటిని తాగాలని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతోంది. అలా అయితేనే మన శరీరం లోని జీర్ణాశయంలో జీర్ణరసాలు సరిగ్గా ఉత్పత్తి అయ్యి,మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. మనం తిన్న ఆహారం ఎంత త్వరగా, సులభంగా జీర్ణం అవుతుందో,అప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉండవచ్చు.


అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి లో, ఎప్పుడూ బిజీగా ఉండే మనలో చాలామంది ఈ పద్ధతిని పాటించడం లేదు.. క్రమంగా ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని, తూచా తప్పకుండా పాటిస్తే,  ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. కాబట్టి మీరు ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నప్పటికి భోజనం చేసిన తరువాత 40 నిమిషాలు వరకు వేచి ఉండి నీటిని తాగడం ఉత్తమం. అయితే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు, భోజనం చేసిన తర్వాత తక్కువ మోతాదులో నీటిని తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: