తలనొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు ఏంటో తెలుసా..?

Divya

ప్రతి ఒక్కరికి ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన వంటివి ఉంటాయి అనేది సహజం. అది పని ఒత్తిడి అయినా కావచ్చు..మరి ఏ కారణం చేతనైనా మనిషి ఒత్తిడికి గురి అవుతూ ఉంటాడు. ఫలితంగా తలనొప్పి రావడం మొదలు పెడుతుంది. ఒక సారి వచ్చిన తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కొంతమంది. కానీ ఇలా తలనొప్పి వచ్చిన ప్రతిసారి టాబ్లెట్ వాడుతుండటం వల్ల అది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి సహజమైన పద్ధతిలో తల నొప్పి ని తగ్గించుకోవడం ఎలానో..?ఇప్పుడు తెలుసుకుందాం..

1.బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, నిమ్మరసం కలుపుకొని తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
2. కొన్ని సార్లు మన శరీరంలో నీరు తక్కువైనా, తలనొప్పి రావడం సహజం. అందుకోసం మనకు సాధారణంగా సూచించబడ్డ విధానమైనా  రోజుకు ఆరు నుండి ఏడు లీటర్ల నీటిని తాగడం ఉత్తమం.
3. వేసవి కాలం రాబోతోంది కాబట్టి వేడి తాపానికి తల నొప్పి రావడం సహజం. అలాంటప్పుడు మన శరీరంలో వేడిని తగ్గించగలిగే కొబ్బరి నీళ్ళు, రాగి జావ లాంటివి చేసుకొని తాగుతూ ఉండడం వల్ల కూడా తలనొప్పి నుంచి బయటపడవచ్చు.
4. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులను కూడా తింటూ ఉంటే తలనొప్పి తగ్గుతుంది.
5. తల నొప్పి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని కొంతసేపు పీల్చుకుంటూ అలా కారిడార్లో నడవండి.. త్వరగా ఉపశమనం కలుగుతుంది.
6. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకుని తాగినా కూడా తలనొప్పి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
7. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగినా కూడా త్వరగా ఉపశమనం కలుగుతుంది.
8.  అలాగే కాఫీ, టీలు కూడా కొంతమందికి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తాయి.

టాబ్లెట్ లేకుండా సహజసిద్ధంగా తయారు చేసుకునే ఇలాంటి పద్ధతులు పాటిస్తే త్వరగా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: