మీ కోసం కొన్ని వంటింటి చిట్కాలు.. ఇంకా ఆలస్యమెందుకు చదివేయండి...?

kalpana
 బియ్యంలో మట్టి గడ్డలు ఎక్కువగా ఉన్నప్పుడు బియ్యం కడిగే నీళ్లలో కొంచెం ఉప్పు వేసి పది నిమిషాలు నానబెట్టి తే మట్టి గడ్డలు కరిగిపోతాయి.                                            
 కాయ కూరలు తరిగేటప్పుడు ముందుగానే శుభ్రం చేసుకోవాలి. తరిగిన తర్వాత శుభ్రం చేయకూడదు.
 కాయగూరలు తరిగిన తర్వాత ముక్కలను కొద్దిసేపు పసుపును నీటిలో వేస్తే ఏవైనా క్రిములు ఉంటే పైకి తేలుతాయి.
 కూరగాయలను చాలా చిన్నగా తిరగకూడదు ఎందుకంటే వాటిలో ఉండే పోషకాలు నశించే ప్రమాదముంది.
 కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చేతులను చింతపండు నీటిలో తప్పుకుంటే దురద ఉండవు.
 తరిగిన కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు వేసి నల పగడం  వల్ల చేదు ఉండవు.
 బంగాళాదుంపలు మెత్త బడినట్లు ఉంటే  తరగబోయే అరగంట ముందు ఐస్ వాటర్లో ఉంచితే గట్టిపడతాయి.
 వంకాయ ముక్కలు తరిగిన  తరువాత నల్లబడకుండా ఉండాలంటే బియ్యం కడిగిన నీళ్లు లో కొంచెం ఉప్పు వేసి కడగడం వల్ల ముక్కలు నల్లబడు.
 ఉల్లిపాయలను అర్ధగంట సేపు నీళ్లలో వేసి ఆ తర్వాత తరగడం వల్ల కళ్ళు మంటలు ఉండవు.
 వెల్లుల్లికి కొద్దిగా నూనె రాసి కొద్దిసేపు ఎండలో ఉంచితే పొట్టు తేలిగ్గా వస్తుంది.
 కోడిగుడ్లను అల్యూమినియం లేదా వెండి పాత్రలో పగలగొడితే అందులో ఉండే సల్ఫర్ వల్ల పాత్రలు నల్లబడతాయి.
 తడిగా ఉన్న పాత్రలో కోడుగుడ్డు పగలగొడితే గుడ్డులోని పసుపు భాగం పాత్రకు అంటుకోకుండా ఉంటుంది.
 నిమ్మకాయను నేల మీద పెట్టి అరచేత్తో బాగా ఒత్తి కాస్త మెత్తబడ్డాక కోసి రసం పిండితే తేలికగా వస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా  వస్తుంది.
 కాలీఫ్లవర్ ను ముక్కలుగా  తరిగిన తర్వాత గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిలో కొద్దిసేపు ముక్కలు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల అందులోని క్రిములు నశిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: