డస్ట్ అలర్జీ సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..!

Divya

ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అమ్మకో,నాన్నకో,  చిన్నాన్నకో,చిన్నమ్మకో లేదా అమ్మమ్మకో,తాతయ్యకో ఇలా ఎవరో ఒకరు డస్ట్ ఎలర్జీ బారిన పడుతూనే ఉంటారు. అయితే ఈ డస్ట్ ఎలర్జీ కాస్త దమ్ము వచ్చినా సరే తుమ్ములు మొదలవడం సహజం. ఆ.. ఏమవుతుందిలే అని ఒక్కసారి ఆదమరచి వ్యవహరించారా అంతే.. దాని ప్రభావం ఎంతో దారుణంగా ఉంటుంది. అంతే కాకుండా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే కారణాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని హోం రెమెడీస్ వాడి,ఈ డస్ట్ అలర్జీని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
అసలు నిజానికి వచ్చే డస్ట్ ఎలర్జీ కి కారణాలు ఏమిటో చూద్దాం.. డస్ట్ అలర్జీ రావడానికి అసలు కారణం డస్ట్. కొందరిలో ఈగలు,దోమలు,బొద్దింకలు, బల్లులు, ఎలుకలు  కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అంతేకాకుండా గాలిలో ఉండే ఫంగస్, దుమ్ము వల్ల కూడా అలర్జీ పెరుగుతుంది. ఇంకా కొన్ని రేణువుల నుండి వెలువడే పుప్పొడి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మరీ ముఖ్యంగా కొంతమందికి వయ్యారిభామ మొక్కలు, పూలు,చెట్లు, గడ్డి నుంచి కూడా అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. మరికొంతమందికి జంతువుల వెంట్రుకలు, పక్షుల రెక్కలు, రెట్ట లు లాంటి వల్ల కూడా డస్ట్ అలర్జీ కి  కారణమవుతాయి..
అయితే కొన్ని హోం రెమెడీస్ వాడి,ఈ డస్ట్ అలర్జీని  తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు..
తేనెను మూడుపూటలా రెండు స్పూన్ల చొప్పున తీసుకుంటూ ఉండటం వల్ల  పుప్పొడి ధాన్యాల వల్ల కలిగే అలర్జీలకు చెక్ పెట్టవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించి కూడా డస్ట్ అలర్జీ ని తగ్గించవచ్చు.  ఒక గ్లాసు వేడి నీళ్లలో, కొంచెం తేనె కలిపి, రెండు స్పూన్ల వెనిగర్ వేసి రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవడం వల్ల అలర్జీ నుంచి బయటపడవచ్చు.
అరకప్పు పాలలో, సగం స్పూన్ పసుపు కలుపుకుని, అందులో కొద్దిగా తేనె కలిపి తాగితే దుమ్ము వల్ల కలిగే  డస్ట్ అలర్జీ ని దూరం చేసుకోవచ్చు.
కాబట్టి  మీరు కూడా డస్ట్ అలర్జీ సమస్యతో బాధపడుతుంటే, పైన చెప్పిన సహజసిద్ధమైన పద్ధతులను పాటించి, త్వరగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: