నరాల వాపు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది ఒక్కసారి ట్రై చేయండి...?

Divya

మన శరీరం లోని నరాలు కరెంట్ వైర్స్ లాంటివి. విద్యుత్ బల్బులో కి కరెంటు ప్రవహించాలి అంటే కరెంటు వైర్ మూలస్తంభం.  అలాగే మన శరీరంలో రక్తం ఒక అవయవం  నుండి మరొక అవయవానికి ప్రవహించాలంటే నరాలు చాలా ముఖ్యం.. అంత ముఖ్యమైన పాత్ర వహించే ఈ నరాలు ఒకవేళ బలహీనపడితే..? మనం అనారోగ్య బారిన పడాల్సిందే..  ఫలితంగా నరాలు నొప్పి కలుగుతుంది. దీనినే నర్వ్ పెయిన్ గా పరిగణిస్తారు.. అయితే ఈ నరాల బలహీనత ఎందుకు ఏర్పడుతుందో..? ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ రోగులు ఎక్కువ అవుతున్నారు.. నరాల బలహీనతకు ఈ డయాబెటిస్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. రక్తపోటు వల్ల కానీ లేదా ఎక్కువగా కొవ్వు పేరుకుపోయినా నరాలు బలహీనపడతాయి. అలాగే ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా వల్ల ఏర్పడే నష్టం నేరుగా నరాలపై ప్రభావం చూపుతుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా మూత్రపిండాలు, కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల కూడా నరాలు దెబ్బ తింటాయి.  ధూమపానం, మద్యపానం చేసేవారిలో కూడా నరాలు దెబ్బతింటాయి..

అయితే ఈ నరాలు దెబ్బతిన్నాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే..? ఏదైనా ఒక ప్రదేశంలో నొప్పులు లేదా వాపులు రావడం, కళ్ళు తిరగడం, నీరసంగా అనిపించడం, రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, తల తిరగడం వంటివి జరుగుతాయి.  అలాగే నరాల బలహీనత తో బాధపడేవారికి శరీరం వేడిగా అనిపిస్తుంది. చెమటలు ఎక్కువగా పట్టడం, బీ పీ ఎక్కువ అవడం, మలబద్దకం, గ్యాస్,ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి.

అయితే ఇందుకోసం ఒక చక్కటి టీ ని తయారు చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి వేయాలి. అలాగే నల్ల యాలకులు తీసుకొని మెత్తగా దంచి అందులో వేయాలి.  ఇక ఆ తరువాత గ్లాస్ నీళ్ళు అరగ్లాసు అయ్యే వరకు బాగా మరిగించాలి.  ఆ తర్వాత వడగట్టి, అందులో బెల్లం వేయాలి.  ఇది రోజు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ కషాయాన్ని రాత్రి పడుకునే ముందు తాగాలి. దీని వల్ల తక్షణ శక్తి అంది,నరాల బలహీనత, గుండెదడ శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: