బూడిదగుమ్మడి కాయలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి... అవి ఇవే...?
గుమ్మడి కాయ తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా మొలల వ్యాధి తో బాధపడే వాళ్ళు గుమ్మడికాయ తీసుకోవడం వల్ల అలలు తగ్గడమే కాకుండా మూత్రం సాఫీగా అవుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వాళ్ళు గుమ్మడి కాయను తీసుకోవడం వల్ల రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా గుమ్మడి కాయ రసం తో పుండు మీద కట్టుకడితే పుండు తొందరగా మారుతాయి.
బూడిద గుమ్మడి కాయను బాగా దంచి రసం తీసుకోవాలి. ఈ రసంలో తేనె కలిపి తాగడం వల్ల ఆడవారిలో బహిష్టు ఆగిపోయే ముందు వచ్చే చికాకు, శరీర వేడి, మూత్రంలో మంట, కాళ్ళు చేతులు మంటలు, ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. ఇలా రోజుకు రెండు మూడుసార్లు పదిహేను రోజులు తీసుకోవాలి.
మూత్రంలో మంట, ముక్కునుండి రక్తం కారడం, మూల వ్యాధి వంటివి ఉన్నప్పుడు నాలుగు చెంచాల గుమ్మడి రసంలో ఒక చెంచా ఉసిరి కాయ రసం, కొంచెం పటికబెల్లం వేసి తీసుకోవడం వల్ల పై సమస్యలు తగ్గుతాయి.
కడుపులో పురుగులు ఉంటే బూడిద గుమ్మడి కాయ లోని విత్తనాలను పొడి చేసి అందులోకి కొబ్బరి పాలు కలిపి తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు బయటికి పోతాయి. అలాగే గుమ్మడి గింజల పొడితో కుంకుడుకాయ పొడి కలిపి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
బూడిది గుమ్మడికాయ తీసుకోవడంవల్ల లివర్ వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా కామెర్ల వ్యాధిని తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధులలో టీబీ వ్యాధి లోనూ నిసత్తువను పోగొట్టడానికి ఉమ్మడి సహాయపడుతుంది.
గుమ్మడికాయలో తేమ, కొవ్వు, పిండి పదార్థాలు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు గుమ్మడి కాయలు తినడం మంచిది.