త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే ఈ మార్గాలను ఫాలో అవ్వండి...?

kalpana
 ప్రస్తుత కాలంలో శుభ కాయంతో ఎక్కువగా బాధ పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు.  అయినా ఫలితం మాత్రం ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, మరియు ప్రణాళికగా పనులు చేయడం వల్ల బరువు ఎక్కువ తగ్గుతారు. నియంత్రిత ఆహారాన్ని అనుసరించడం వల్ల,కొన్ని పనులు క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలోని  కొవ్వును కరిగించుకోవచ్చు. త్వరగా బరువు తగ్గడానికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవి ఏమిటో. ? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
 నిద్రలేమితో బాధపడేవారు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి వల్ల శరీరంలో అధిక కొవ్వు తగ్గించే సామర్థ్యం తగ్గుతుందని చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియజేస్తున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు బాగా నిద్ర పోవాలి. అలా అని చాలా సేపు నిద్ర పోకూడదు. రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోతే సరిపోతుంది.
 ఉదయము తొందరగా లేవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం తొందరగా లేవడం వల్ల రోజు సరైన  శక్తి వస్తుంది దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
 బరువు తగ్గాలనుకొనే వారు బయట ఫుడ్డు తినకుండా ఇంట్లో తయారుచేసిన ఫుడ్ తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా పిండి  పదార్థం ఎక్కువగా ఉన్నవి, కేలరీలు ఎక్కువగా ఉన్నవి, అనారోగ్య  కొవ్వులను తగ్గించడానికే ఇంటి భోజనం చేయడం మంచిది. దీనివల్ల క్రమంగా బరువు తగ్గుతారు.
 ఒమేగా 3 అధికంగా ఉండే సాల్మన్ చేపలను, సీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇవి బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా జీవ ప్రక్రియ ను సక్రమంగా జరిగేటట్లు చేస్తాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
 శరీరంలో జీవక్రియ వేగంగా  జరగడానికి మీరు చాలా అవసరము.  కాబట్టి నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. శరీరంలోని  వ్యర్థాలను తొలగించడానికి నీరు చాలా అవసరం. నీరు పుష్కలంగా తాగడం వల్ల ఒకటి రోగ {{RelevantDataTitle}}