నల్ల పుట్టగొడుగుల గురించి ఎప్పుడైనా విన్నారా.. అయితే దాని ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకోండి..!

Divya

సాధారణంగా మనం పుట్టగొడుగులు అనగానే కొంచెం బూడిద రంగులో ఉండే వాటిని మాత్రమే చూసి ఉంటాము. అయితే నల్ల పుట్టగొడుగులను చాలా మంది చూడకపోయుండవచ్చు. అయితే నల్ల పుట్టగొడుగులను  ట్రఫీల్ మష్రూమ్స్ అని అంటారు. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పైకి కందగడ్డ లాగా కనిపించే ఈ పుట్టగొడుగులకు జన్యుపరమైన మార్పులు చేసి, తెలుపు రంగులో కూడా వీటిని పుట్టిస్తారు..


అయితే కేవలం అడవులలో మాత్రమే పెరిగే ఈ ట్రఫీల్ మష్రూమ్ ఒక్కొక్కటి 30 నుంచి 60 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. అయితే దీని ధర  ఒక కిలో ప్రకారం  రెండు వేల రూపాయల నుంచి 7 వేల రూపాయల వరకు పలుకుతోంది. అయితే ఇంత ఖర్చు పెట్టినా దానికి రెట్టింపు స్థాయిలో  ప్రయోజనం మనకు లభిస్తుంది అంటున్నారు పరిశోధకులు.


అయితే ఈ పుట్టగొడుగుల నుంచి నూనెను తీస్తారు. ఇది ఆలివ్ ఆయిల్ కన్నా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఇటీవలకాలంలో పాస్తా, పిజ్జాల లో  టేస్ట్ కోసం ఈ  నూనెను వాడతారు. ఈ నూనెలోని పాలీఫెనాల్స్ మన శరీరంలోని విషపదార్థాలను, చెడు బ్యాక్టీరియాను బయటకు తొలగిస్తుంది. ఇవి మన శరీరంలోని కణాలను కాపాడి, మనకు ముసలితనం రాకుండా చేస్తాయి.  ప్రస్తుత కాలంలో ఈ నూనెల వాడకం ఎక్కువవుతోంది అని చెప్పవచ్చు. అయితే అది ఖర్చుతో కూడుకున్న పని అని మాత్రం గుర్తుంచుకోవాలి.. ఈ నల్ల పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో మంటలు, నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక గుండెపోటు,డయాబెటిస్ కూడా రాకుండా ఆపుతాయి..


నల్ల పుట్టగొడుగుల్లో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఫైబర్,ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.. అయితే మన శరీరానికి కావలసిన అమైనో యాసిడ్ లను కూడా ఈ పుట్టగొడుగులు అందిస్తాయట. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువవడంతో ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. పూర్తిగా క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఈ పుట్టగొడుగులు తింటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని ఒక అధ్యయనం ద్వారా తేలింది. పూర్తిగా క్యాన్సర్ ను నివారించడానికి ఈ  నల్ల పుట్టగొడుగుల నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. సెర్వికల్, బ్రెస్ట్, కొలొన్  వంటి క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో ఈ పుట్టగొడుగులు బాగా పనిచేస్తాయని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: