మనం ఆరోగ్యంగా ఉన్నామో..లేదో.. తెలుసుకోవడం ఎలా..?
ప్రస్తుత కాలంలో వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా, అలాగే మనం తీసుకునే ఆహారంలో పోషక లోపాల కారణంగా మనలో చాలామంది జబ్బుల బారిన పడుతూ ఉంటారు. అయితే మన శరీరం కూడా అనేక రకాల అనారోగ్యాలను పసిగడుతూ ఉంటుందని, అనేక రకాల సంకేతాలను ఇస్తుందని చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ ఒకవేళ ఆ లక్షణాలను కనుక మనం పసిగట్టినట్టు అయితే అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు అంటున్నారు వైద్యులు.. అలాగే అనారోగ్యాల వల్ల కలిగే లక్షణాలు గురించి కూడా డాక్టర్లు కనుగొన్నారట.. అయితే ఆ లక్షణాలు ఏంటో..? మన శరీరం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీర ఉష్ణోగ్రత :
శరీర అవయవాలు చల్లగా ఉండడం మంచిది కాదు. ఒకవేళ మీ అవయవాలు గనుక చల్లగా ఉన్నట్లయితే అది ఒక పెద్ద సమస్య అని గుర్తించాలి. చేతులు, కాళ్లు,చెవులు, పాదాలు చల్లబడినట్లు అయితే అది బ్లడ్ సర్కులేషన్ ప్రాబ్లం అని సూచిస్తుంది. మీ శరీరంలో రక్తం సరఫరా సరిగా జరగనప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.
పెదవులు పొడిబారడం:
శీతాకాలం, వేసవి కాలం అనే తేడా లేకుండా చాలామందికి పెదవులు పొడిబారి పోతూ ఉంటాయి. కానీ చాలామంది పెదాలకు లిప్ బామ్ రాస్తూ, తగిన తేమను అందిస్తూ ఉంటారు. కానీ తరచూ పెదవులు పొడిబారినట్లు అనిపిస్తే అది విటమిన్స్ లోపం అని గుర్తించాలి..
బ్యాడ్ బ్రీత్ :
దవడలు వాపు వచ్చినప్పుడు దుర్వాసన వస్తుంది. ఒకవేళ మీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, మన శ్వాస కూడా చెడు గా వస్తుంది. ఒకవేళ మీకు కూడా అలాంటి దుర్వాసన వచ్చినట్లయితే, మేలో రోగనిరోధకశక్తి సరిగాలేదని గుర్తుంచుకోవాలి.
కాళ్లల్లో వాపులు :
కాళ్లవాపులు కేవలం ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తాయి అనేది మాత్రం అపోహ. ఒకవేళ కాళ్లవాపులు వస్తున్నట్టు అయితే అది థైరాయిడ్ లేదా గుండె జబ్బులకు సంకేతం అని చెప్పవచ్చు..
ఎత్తు:
సాధారణంగా మనిషి ఎత్తు ఎదుగుతూ ఉంటాడు.. కానీ ఎత్తు తగ్గిపోవడం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా..సాధారణంగా మనిషి కూడా ఎత్తు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ విషయం చాలామంది లో కొద్ది మంది కి మాత్రమే తెలుసు. శరీరంలో ఎముకల వల్ల కలిగే సమస్య ఇది. ఒకవేళ మన శరీరంలో ప్రోటీన్, కాల్షియం లాంటి పోషకాలు తగ్గిపోయినప్పుడు మనం ఎత్తు కూడా తగ్గుతాము.
ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరంలోని ఎన్నో అవయవాలు మనకు వచ్చే సమస్యలను ముందుగానే పసిగట్టి, ఆ సంకేతాలను మనకు ఇస్తాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఆ సంకేతాలను గమనించి, మీకు ఎలాంటి జబ్బులు రాకుండా ముందుగానే జాగ్రత్తపడండి..