దానిమ్మ ను ప్రతి రోజూ ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు...!!!

kalpana
మనం నిత్యం ఆరోగ్యంగా జీవించాలి అంటే సరైన ఆహారం తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేనివారు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనది రక్తహీనత. శరీరంలో బీ12 విటమిన్, ఐరన్‌లు లోపించటంవల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మన ఆహారంలో తప్పనిసరిగా సీజనల్‌గా లభించే పండ్లు అన్నింటినీ భాగం చేసుకోవాలి. ముఖ్యంగా దానిమ్మ పండ్లను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవటంవల్ల ఎర్రరక్తకణాల అభివృద్ధి చెందడంతో పాటు,  యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించి రోగనిరోధక శక్తిని పెంపొందించ‌డంలో సహాయ పడుతుంది.
దానిమ్మ పండు లో ఐరన్ సమృద్ధిగా లభించడం తో శరీరంలో హేమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.
దానిమ్మపండులో ఉండే పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇందులో ఉండే అధిక పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది ఈ కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలిగించి,దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది.
గుండె జబ్బులకు చెక్‌ పెట్టడానికి కూడా దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. రోజుకో గ్లాసు దానిమ్మ రసం తాగితే హృదయ సంబంధిత రోగాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు

ప్రతిరోజూ గర్భిణీ స్త్రీ దానిమ్మపండు తింటుంటే, శిశువు మెదడు అభివృద్ధి చెంది,హార్మోన్ల లోపాలు సవరించడం లో కీలక పాత్ర పోషిస్తుంది.
దానిమ్మపండు అధిక స్థాయిలో విటమిన్ సి, ఇ ని కలిగి ఉంటుంది. ఇది చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చక్కటి పరిష్కార మార్గం.దానిమ్మ పండులో 'పాలీఫినాల్', యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మంపై ఏర్పడిన మంటలు, వాపులు తగ్గుతాయి.
దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: