అందంగా ఉండడానికి మీ కోసం కొన్ని టిప్స్...!

kalpana
 అందంగా కనపడాలని చాలామంది అనుకుంటారు. కానీ క్రీములు రాసినా అందంగా మాత్రం కనపడరు. అంతేకాకుండా ఆ  క్రిముల వల్ల లేనిపోని సమస్యలు వస్తుంటాయి. అందంగా  కనబడడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి...

 ముఖం అందంగా కనబడటానికి తాజా  టమోటాను తీసుకొని దానినుండి రసం తీసుకొని అందులోకి రెడ్డి స్పూన్లు పాలు కలిపి ముఖానికి రాసి పదహైదు  నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. అలాగే ముఖం పై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది. దీని వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.                         

 ముఖం పైన ముడతలు గా ఉంటే, దీనివల్ల ముసలితనం వచ్చినట్లు కనబడుతుంది. ఇలా  కనపడకుండా ఉండటానికి ఒక స్పూన్ పైనాపిల్ రసం, ఒక స్ఫూన్ యాపిల్ రసం, ఒక స్పూన్ నిమ్మరసం మూడింటిని కలిపి ముఖానికి  అప్లై చేయాలి . ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోతాయి.

 ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్  ద్రాక్ష గుజ్జు ఒక స్పూన్ నిమ్మరసం మూడింటిని  కలిపి   ముఖం పై బాగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. చేయడంవల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది.

 తాజాగా ఉన్న మీగడ ను  తీసుకొని ముఖం మీద నెమ్మదిగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడుక్కోవాలి. చేయడంవల్ల ముఖంపై  పైన మృతకణాలు తొలగిపోయి. ముఖానికి తాజాదనం వస్తుంది.

 ముఖంపై  నల్ల మచ్చలు ఏర్పడినప్పుడు కొంచెం పెరుగు, కొంచెం నల్ల మిరియాల పొడిని కలిపి ముఖం మీద రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా  చేయడం వల్ల ముఖం పై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: