పచ్చి బఠానీలు ఆరోగ్యానికి చాలా మంచివని మీకు తెలుసా...?

kalpana
 పచ్చిబఠానీలను పచ్చగానే అయినా తినవచ్చు, ఉడకబెట్టి  తినవచ్చు, కూర చేసుకుని అయినా తినవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయి. అయితే పచ్చిబఠానీలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని చాలా ముదిరిపోయి ఉంటాయి. నెల పై నల్లటి మచ్చలు కూడా ఉంటాయి. ఇవన్నీ లేకుండా చూసి తీసుకోవాలి. తాజాగా ఉన్న బఠాణీలను తీసుకోవడం చాలా మంచిది. పచ్చిబఠానీలను ఎక్కువగా బిర్యానీ లో ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా బంగాళదుంప వేపుడు లోను వాడుతూ ఉంటారు. వచ్చి  బఠాణీలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

 పచ్చిబఠానీలు తీసుకోవడం వల్ల గుండెజబ్బుల బారి నుండి వాడుకోవచ్చు. ఎందుకంటే పచ్చి బఠానీల లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఒమేగా  ఫ్యాటి యాసిడ్స్, విటమిన్  ఏ, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. అలాగే రక్తనాళాలను కూడా రక్షిస్తాయి.

 మలబద్ధకాన్ని నివారించడానికి కావలసిన ఫైబరు పచ్చి బఠానీల లో అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది .క్యాన్సర్ కుండా  ఉండడానికి పోరాడే ఔషధ  గుణాలు కూడా ఉన్నాయి. రోజు ఒక కప్పు పచ్చి బఠాణీలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి పరిశోధకులు తెలుపుతున్నారు.

 బాధ పడుతున్న వాళ్ళకి పచ్చిబఠానీలు చాలా మంచివి. ఎందుకంటే ఇన్సులిన్ ను నివారిస్తాయి. అంతే కాకుండా పచ్చిబఠానీ లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోస్ పెరగకుండా చేస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళు పచ్చిబఠానీలను  తీసుకోవడం  చాలా మంచిది.

 పచ్చి బటానీలు దొరికే సమయంలో వాటిని కచ్చితంగా  వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎముకలు దృఢంగా ఉండడానికి, పచ్చి  బటానీలు బాగా సహాయపడుతాయి. ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లను రాకుండా అరికడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ  మెరుగుపడటానికి పచ్చి  బఠానీలు   సహాయ పడతాయి. అందుకే ఇవి దొరికే సమయములో బఠానీలను బాగా వినియోగించుకోవాలని ఆరోగ్య  నిపుణులు తెలియజేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: