కోడి గుడ్లు, పాలు రెండూ ఒకేసారి తినవచ్చా..?
కోడి గుడ్లు, పాలు ఈ రెండూ అనేక పోషక సమ్మేళనాలతో కూడి ఉన్నాయని మనకు తెలుసు. అందుకే వీటిని సంపూర్ణ పోషకాహారాలుగా పిలుస్తారు. శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, మినరల్స్ వీటిలో సమృద్ధిగా లభిస్తాయి. అయితే వీటిని ఒకేసారి కలిపి తినవచ్చా..? లేదా..? ఒకవేళ తింటే ఏమైనా దుష్ప్రభావాలు కలుగుతాయా..? అని చాలామందిలో అపోహలు కలుగుతూ ఉంటాయి.. అయితే ఇప్పుడు అలాంటి సందేహాలు అన్నింటిని నివృత్తి చేసుకుందాం..
ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్థాలను కాంబినేషన్‌గా తీసుకోకూడదు.. అయితే కొంత మందిలో ఇలాంటి కాంబినేషన్ సరిపోతే, మరికొందరికి అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఎవరికి వారు తమ శరీరానికి సరిపోయే పోషకాలను ఆహారపు కాంబినేషన్ గా తీసుకోవడం మంచిది. అయితే ఉడకపెట్టిన కోడిగుడ్లను తినకముందే పాలు తాగవచ్చు.. అలా కాకపోతే ఉడకబెట్టిన గుడ్లు తిన్నాక పాలు తాగవచ్చు. కాకపోతే కొంతమందిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
మరికొంత మందిలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. అలాంటి వారు నిరభ్యంతరంగా ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా వ్యాయామం, బాడీ బిల్డింగ్ చేసే వారు పచ్చ కోడిగుడ్లను, పాలను ఒకేసారి తీసుకుంటారు. అయితే అలా చేయడం శరీరానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. పచ్చి కోడిగుడ్లలో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలో పచ్చిగా ఉన్నప్పుడు తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉడికించిన కోడిగుడ్లు ను తినడానికి ప్రయత్నించండి..
ఇలా తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఉడకబెట్టిన కోడి గుడ్డు తిన్న తర్వాత పాలు తాగడం మంచిది. కాబట్టి ఎవరికైనా ఈ రెండు ఒకేసారి తిన్నప్పుడు ఏదైనా సమస్య అనిపిస్తే, వెంటనే వీటికి దూరంగా ఉండండి. వీటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంటుంది..