ఆరోగ్యంగా ఉండాలంటే, మనం తినే ఆహారాన్ని మార్పు చేసుకోవాలి...?
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండాలి అనుకుంటే మంచి పోషకాలున్న తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. అలాగే శరీరానికి మాంసకృత్తులు కూడా అవసరమవుతాయి. ఇలాంటి సమయంలో చేపలు, చికెన్ అవార్డు తీసుకోవడం మంచిది. వీటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి.
ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్య కారణం బరువు. బరువు పెరగడం వల్ల రక్తపోటు, హృద్రోగం, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. ఇంకా ఎముకలకు సంబంధించిన సమస్యలు, రక్తస్రావ సమస్యలు వంటివి కూడా వస్తాయి. కాబట్టి ఎంత బరువు ఉండాలి. అనే విషయంపై డాక్టర్ను సంప్రదించడం మంచిది. మన బరువును బట్టి వారిచ్చే ఇచ్చే సలహాలు క్రమం తప్పకుండా పాటించడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
చాలామంది వారికి నచ్చిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. నచ్చకపోయినా పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. అలా కాకుండా ఏది పడితే అది ఇష్టం గా తింటే అనేక సమస్యలు వస్తాయి. అలాంటి వారు తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.
భోజనం చేసేటప్పుడు సమయం పాటించాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం చేయడంవల్ల ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా భోజనానికి భోజనానికి మధ్య అల్పాహారం ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల బరువు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి.
చాలామంది రుచిగా ఉందని ఎక్కువ ఆహారాలను తింటూ ఉంటారు. ఆహారంలో ఉప్పు, తీపి, కొవ్వు ఉండకూడదని ప్రజలు చూస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా కొద్దిగా ఉండేటట్లు చూసుకోవాలి. పూర్తిగా మానేయకుండా కొద్దిగా అయినా శరీరానికి అందేటట్లు చేయాలి.
మనం తినే ఆహారంలో పోషకాలు ఉన్నాయో, శరీరానికి అవసరం అయ్యే లేదో చూసుకొని తినడం మంచిది. మనం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. శరీరానికి అవసరమైన పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఉంటే సరిపోతుంది దీంతోపాటు పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది.
మనం తినే పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే వాటిని మార్పులు చేసుకోవడం చాలా మంచిది. తినే ఆహారాన్ని డైట్ లో ప్లాన్ చేసుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.