శెనగపిండితో చర్మ సంరక్షణ... ఎలా వాడాలంటే..?

kalpana
 ముఖం అందంగా కనపడాలని చాలా మంది అనుకుంటారు. నీకోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎన్నో క్రీములు, వాడుతూ ఉంటారు. అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. మన ఇంట్లో వండే వాటితోనే చర్మ సంరక్షణ కాపాడుకోవచ్చు. అందులో శెనగపిండి ఒకటి. శెనగపిండితో ముఖం పై ఉన్న మొటిమలు, మచ్చలు వంటి వాటిని తొలగించుకోవచ్చు. అంతేకాకుండా చర్మం  పై అవాంఛిత రోమాలను తొలగించడానికి కూడా శనగపిండి దోహదపడుతుంది. శనగ పిండి తో పాటు ఇంట్లో ఉండే అన్నింటిని వాటికి జోడించి చర్మ సంరక్షణకు వాడడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అవి  ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
 ముఖం పై ఉన్న మచ్చలను తగ్గించడానికి, ముఖం కాంతివంతంగా ఉండడానికి ఈ విధంగా చేయాలి ఒక పస్ఫూన్ సెనగపిండి, ఒక స్పూన్ కలబంద గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేసి నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖం కాంతివంతంగాను, మృదువుగా  ఉండడమే కాకుండా ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి.
 ముఖం పై జిడ్డు ఉన్నవాళ్ళు రెండు టేబుల్ స్పూన్లు ముల్తాని మట్టి, టేబుల్ స్కూల్ శనగపిండి, రోజ్ వాటర్ లో కలిపి  ముఖానికి రాసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై  ఉన్న  మలినాలను తొలగించడం కాకుండా, జిడ్డును కూడా కలిగిస్తుంది.
 రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి,  చిటికెడు పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ లో కలుపుకుని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి  బాగా అప్లై చేయాలి. ఈ విధంగా చేయడం. ముఖం ప్రకాశవంతంగా  మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా  పొడి చర్మం ఉన్నవాళ్లు ఈ మిశ్రమానికి మజ్జిగ మీగడ   కలిపి కలిపి రాసుకోవడం వల్ల చర్మానికి  కావలసిన తేమ లభిస్తుంది.
 చర్మంపై మృత  కణాలను తగ్గించడానికి ముఖంపై  ఉన్న జిడ్డును  ను తొలగించడానికి శెనగపిండిలో కి తగినంత పెరుగు కలుపుకుని పేస్ట్లా చేసుకుని ముఖానికి  అప్లై చేయాలి. ఐదు నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మృత  కణాలు తొలగిపోయి  చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
 ముఖంపై ముడతలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి, రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, బాగా పండిన ఒక టమాటా రసాన్ని తీసుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి బాగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు పోయి ముఖము నునుపుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: