ఒక మనిషి బ్రతకాలంటే
గాలి ఎంత అవసరమో. నీరు కూడా అంతే అవసరం. నీరు తాగకుండా మనిషి బ్రతకలేడు. రోజుకి కనీసం 5 గ్లాసూలైన నీళ్లు తాగాలని ఆరోగ్యానిపుణులు సూచిస్తున్నారు. నీటిలో వుండే మినరల్స్ మనిషికి చాలా అవసరం. కాబట్టి తప్పకుండా నీటిని తాగాలి.ఇక చాలా మంది కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తారు. కాని వారికి సరిగ్గా వంట పట్టదు. ఇంకా సరిగ్గా జీర్ణం కాదు. దానికి కారణం భోజనం చేసేటప్పుడు నీరు తాగే విధానం కూడా ఒక్కటే. మనం భోజనం చేసేటప్పుడు నీళ్లు ఎలా తాగుతున్నాం ఏ విధంగా తాగుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి.నీరు మనం తిన్న ఆహారాన్ని జీర్ణక్రియకు వీలుగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.చాలామంది భోజనం తరవాత ఎక్కువ నీళ్లు తాగుతారు.భోజనానికి ముందు నీరు త్రాగటం శరీరంలో బలహీనతకు దారితీస్తుంది, భోజనం చేసిన వెంటనే నీరు ఎక్కువగా త్రాగటం స్థూలకాయానికి దారితీస్తుంది.నీళ్లు తాగే విషయంలో మనం అనుసరించవలసిన ఉత్తమమైన మార్గం ఏమిటంటే? భోజనం చేసే సమయంలో సిప్ చేస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా మంచి నీరు తాగడం ఉత్తమ పద్ధతి.ఇలా తీసుకున్న నీరు మనం తిన్న ఆహారాన్ని జీర్ణక్రియకు వీలుగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ సజావుగా జరగడానికి ఈ పద్ధతి మంచిదని నిపుణులు చెబుతున్నారు.వెచ్చని నీటిని తాగాలి.శరీరంలో మంచిగా జీర్ణక్రియ జరగాలన్నా, శరీరంలో జీవక్రియా రేటు సక్రమంగా ఉండాలంటే వెచ్చని నీటిని భోజనం చేసేటప్పుడు త్రాగాలి.త్రాగడానికి వినియోగించే నీరు మరిగించేటప్పుడు, పొడి అల్లం, వట్టి వేర్లు, బాబూల్, సోపు గింజలను కూడా కలుపుకోవచ్చు.మెరుగైన జీర్ణక్రియ జరగడంకోసం, నీటిలో మూలికల మిశ్రమాన్ని కూడా నిపుణుల సూచనల మేరకు వాడొచ్చు.కాబట్టి భోజనం చేసేటప్పుడు ఈ విధంగా నీళ్లను తాగండి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...