షుగర్ నార్మల్ లోకి రావాలంటే.. ఈ గింజలను తీసుకోండి...
అవిసె గింజల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. మాంసము తినే వాళ్ళు ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు అందుతాయి. దీంతో ఎముకలు, కీళ్లు దృఢంగా ఉంటాయి. నొప్పులు, వాపులు వంటివి కూడా తగ్గుతాయి.
అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లకు లకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఆస్తమా ఉన్న వాళ్లకి ఆ అవిసె గింజలు చాలా మంచి చేస్తాయి.
అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే విషపదార్థాలను బయటికి పంపడానికి సహాయపడతాయి. అంతేకాకుండా సమస్యలను నివారిస్తాయి.
క్రమం తప్పకుండా కొన్ని అవిసె గింజలను తినడం వల్ల స్త్రీలకు రుతు క్రమంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ గింజల్లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్ స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి.
మధుమేహం ఉన్నవాళ్లు అవిసె గింజలను తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి తినడం వల్ల చక్కర స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంది.
రక్త హీనతతో బాధపడే వాళ్ళు అవిసె గింజలను తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు పెరగడమే కాకుండా, రక్తహీనత కూడా పోతుంది .
అవిసె గింజలు తినడం వల్ల చర్మము కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. అలాగే శరీరంలోని ద్రవాలు ఎల్లప్పుడూ సమతుల్యంలో ఉంటాయి.
అవిసె గింజలను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది