చిన్న పిల్లలు పుష్టిగా ఉండేందుకు ఈ ఆహార పదార్ధాలను అలవాటు చెయ్యండి....

Purushottham Vinay
చిన్న పిల్లల ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళు పుష్టిగా ఉండేందుకు ఖచ్చితంగా మనం శ్రద్ధ తీసుకోవాలి.మామూలుగా చిన్న పిల్లలకు మనం అల్పాహారం, భోజనం లో కూరగాయలు, పండ్లు వగైరా వాటిని తినిపిస్తూ ఉంటాము. స్నాక్స్ టైం లో మాత్రం బయట దొరికే ఆయిల్ ఫుడ్ లేదా చిప్స్ వంటివి తీసుకుంటూ ఉండటం వల్ల ఎటువంటి ఆరోగ్యం మనకి ఉండదు. అలాగే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు హోం వర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తాను వంటివి చెబుతూ ఉంటారు ఇటువంటి పిల్లలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని మీరు వీలైనంత వరకు తగ్గించడం మంచిది. మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేయడం.. ఎక్కువగా కూరగాయలు వేసి శాండ్విచ్ చేయడం లాంటివి మీరే చేయండి.
దీని వల్ల మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళ తీసుకోగలరు. మిగిలిపోయిన వెజిటేబుల్స్ నుండి ర్యాప్ లాంటివి చేసి పెట్టండి.



కూరగాయలు పండ్లు ఎక్కువగా వాళ్లకి పెడుతూ ఉండండి దీని వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పైగా భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది. కనుక వీలైనంత వరకు బయట ఫుడ్ ని తీసుకోకుండా ఉండేలా చేయండి ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయల ముక్కలు తో సలాడ్స్ వంటివి చేయండి.అలాగే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఇంకా డ్రై ఫ్రూట్స్ అలాగే డేట్స్ పిల్లలకు ఎంతో మంచివి. అవి పిల్లలు పుష్టిగా ఉండేందుకు ఎంతగానో సహాయపడతాయి.ఒక కప్పులో ఉడికించిన బంగాళ దుంపలు లేదంటే పన్నీర్ ఇలా ఆరోగ్యకరమైన వాటిని వేయండి. ఆ తర్వాత దాని మీద కొద్దిగా డ్రైఫ్రూట్స్, గింజలు, పాలు ఇలాంటివి కూడా వేసేయండి. వాళ్ళకి నచ్చిన చాక్లెట్ పౌడర్ దాని మీద వెయ్యండి.ఇవి పిల్లలకు తినపించండి. ఇది వాళ్ళ ఎదుగుదలకు చాలా మంచిది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: