వంకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

Suma Kallamadi
వంకాయను తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. వంకాయను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వంకాయను తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా. వంకాయలు తరచూ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు శక్తి పెరుగుతుంది. దీని ద్వారా ల‌భించే ఫైటోన్యూట్రియంట్‌లు, పొటాషియం మీ మెద‌డుకు ఆక్సిజ‌న్ స‌ప్లై స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డానికి తోడ్పడతాయి. ఫ్రీరాడిక‌ల్స్‌ను ఆపేసి, ర‌క్త‌నాళాల‌ను విశాల‌ప‌ర‌చి వాసోడైలేటర్లలాగా ప‌నిచేస్తాయి. అలాగే న‌రాల వ్య‌వ‌స్థ‌ను స్టిమ్యులేట్ చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.
అంతేకాక.. యాంటీ ఆక్సిడెంట్లు, ఆంతోసైయానిన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఈ వంగ‌ క్యాన్స‌ర్ రాకుండా నిరోధించ‌గ‌ల‌దు. క్యాన్స‌ర్ క‌ణాల‌ను పెర‌గ‌కుండా నిరోధించి, వ్యాధి త‌గ్గ‌డంలో తొడ్ప‌డుతుంది. ఈ కాయ తొడిమ‌లో క‌నుగొన్న సోల‌సొడైన్ రహ్మ్నోసిల్ గ్లైకోసైడ్‌లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను రూపుమాప‌గ‌ల‌వు. అందుకే ఈ కాయలను తొడిమలతో సహా తీసుకోవడం మంచిది. వంకాయలో ఉన్న అంతోసియానిన్ అనే పిగ్మెంట్ వ‌ల్ల గుండె ప‌నిత‌నం మెరుగ‌వుతుంది. ఇది చెడు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి, మంచి చేసే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
ఇక ఈ మొక్క‌లో ల‌భ్య‌మ‌య్యే ఫెనోలిక్ కాంపౌండ్‌లు ఆస్టియోపోరోసిస్‌తో పోరాడ‌తాయి. దీనితో పాటు ఎముక‌లు సామ‌ర్థ్యాన్ని పెంచి , ఎముక‌ల్లోని మిన‌ర‌ల్ సాంద్ర‌త‌ను మెరుగుప‌రుస్తుంది. అంతేకాక‌, ఇందులో దొరికే ఐర‌న్‌, కాల్షియం ఎముక‌లు ఆరోగ్యంగా ఉండ‌టానికి తోడ్ప‌డుతుంది. వంకాయలో కార్బోహైడ్రేట్‌లు, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండి, వెయిట్ లాస్ డైట్ ప్లాన్ కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఇందులోని స‌పోనిన్ శ‌రీరంలో కొవ్వు చేర‌కుండా, శ‌రీరం కొవ్వును గ్ర‌హించ‌కుండా చేస్తుంది.
అయితే వంకాయలో ఐర‌న్ శాతం ఎక్కువ‌. అలాగే థియామిన్‌, నియాసిన్‌, కాప‌ర్, ఫైబ‌ర్‌, ఫోలిక్ యాసిడ్‌, విట‌మిన్ సి, కె, బి6, పొటాషియం, మాంగ‌నీస్ వంటి న్యూట్రియంట్లు కూడా అధికంగా ఉంటాయి. దీన్ని తరచూ తీసుకోవడంతో మీరు రక్త హీనత తగ్గి ఆరోగ్యంగా, చురుకుగా ఉండ‌గ‌ల‌రు. ఇందులో నీటి శాతంతో పాటు ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా ఉండ‌టం వ‌ల్ల పేగు వ్య‌వ‌స్థ‌లోని అనారోగ్యాన్ని త‌గ్గిస్తుంది. ల్యాక్స‌ేటివ్‌గా ప‌నిచేసి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మొత్తంగా ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌నంత‌టినీ మెరుగుప‌రుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: