పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల... కొన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చు...

kalpana


 పొద్దుతిరుగుడు విత్తనాలు టైం పాస్ కోసము తింటుంటారు. కానీ ఇందులో ఉన్న పోషకాల గురించి చాలా మందికి తెలియదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పొద్దు తిరుగుడు విత్తనాలు తినడం మంచిది. విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో? ఎప్పుడూ తెలుసుకుందాం...

 పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాకుండా బీ కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. వీటితో పాటు పాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉన్నాయి. ఇవి శరీరంలోని ముఖ్యమైన అవయవాలు పని చేయడానికి సహాయ పడతాయి.

 డయాబెటిస్ ఉన్న వాళ్లు కూడా సన్ ఫ్లవర్ ఆయిల్ ను వాడవచ్చు. అలాగే విత్తనాలను కూడా తినవచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆసిడ్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

 పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల గాయాలు తొందరగా మానిపోతాయి. ఎందుకంటే ఈ విత్తనాల్లో లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల గాయాలు తొందరగా మానిపోతాయి.

 గాయాలు ఇన్ఫెక్షన్ కాకుండా పొద్దుతిరుగుడు విత్తనాలు విత్తనాలు సహాయ పడతాయి. అంతేకాకుండా గుండె పోటు క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గించడానికి ఈ విత్తనాలు బాగా పని చేస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఈ, ఫ్లేవనాయిడ్స్ అనే ఫినోలిక్ కాంపౌండ్స్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి సహాయపడతాయి.

 ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికి సన్ఫ్లవర్ విత్తనాలు తినడం వల్ల ఇందులో ఉండే లినోలిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది.హైబీపీ కంట్రోల్ అవుతుంది. ఇందుకు కూడా విటమిన్ E ఉపయోగపడుతుంది.
 శ్వాస తీసుకోవడం తేలిక. ఆయుర్వేదంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. సన్‌ఫ్లవర్ సీడ్స్... మన ఊపిరి తిత్తులను బాగు చేస్తాయి. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడూ ఎదురయ్యే సమస్యల్ని నయం చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: