సబ్జా గింజలకు, చియా గింజలకు కు మధ్య తేడా ఏంటి..? ఏవి బెటర్..
సబ్జా గింజలు ఎండా కాలానికి పెట్టిన పేరు. చల్లని నీటిలో సబ్జా గింజలు వేసుకొని, నానబెట్టి తినడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది. అంతేకాకుండా శరీరానికి చలువ కూడా చేస్తుంది. సాధారణంగా ఎవరికైనా శరీరంలో వేడి చేసింది అంటే మాత్రం మొదట గుర్తొచ్చే మాట సబ్జాగింజలు తినమని చెబుతుంటారు. ఈ సబ్జా గింజలనే తీపి తులసి గింజలు అని కూడా అంటారు. ఇవి మన భారత దేశానికి చెందినవి. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఎండాకాలంలో ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. అంతేకాకుండా ఎండాకాలంలో ఎక్కువగా చాలామంది ఎండదెబ్బకు, వడదెబ్బకు గురవుతారు. అలాంటి వారు ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.. సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ,జీర్ణ సమస్యలు,జుట్టు రాలడం వంటి సమస్యలను అధిగమించవచ్చు.
ఇక చియా గింజలు విషయానికి వస్తే, ఇవి మెక్సికోలో పుట్టాయి. ఇందులో ఫైబర్,ఒమేగా త్రీ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో శక్తిని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచి, డయాబెటిస్ రాకుండా చేస్తాయి. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా చాలాబాగా పనిచేస్తాయి.
ఇక ఈ రెండింటి విషయానికొస్తే, సబ్జా గింజలు నలుపు రంగులో ఉంటే, చియా గింజలు బూడిద రంగులో ఉంటాయి. ఈ చియా గింజలు అండాకారంలో సబ్జా గింజల కంటే పెద్దగా కనిపిస్తాయి. చియా గింజలు నీటిలో వేసిన కొద్దిసేపటి తరువాత నెమ్మదిగా నీటిని పీల్చుకుంటాయి. ఇక అంతే కాకుండా వీటి బరువు కంటే పది రెట్లు అధిక బరువు పెరిగి, నీటి అడుగుకు వెళ్లి జిగట గా మారుతాయి. ఇక సబ్జా గింజలు మాత్రం నీటిలో వేయగానే, కొంతసేపటికి చుట్టూ ఒక పారదర్శక పొర ను ఏర్పాటు చేసుకుంటాయి.
ఇక వీటి ఉపయోగాలు విషయానికొస్తే చియా గింజలను అలాగే తినవచ్చు. కానీ సబ్జా గింజలు నీటిలో నానబెట్టి మాత్రమే తినాలి. ఇవి నేరుగా తింటే చాలా ప్రమాదకరం. ఇక పోషకాల విషయానికి వస్తే దేనికదే సాటి. రెండింటిలోనూ సమానమైన పోషకాలు కలిగి ఉంటాయి. అయితే బరువు తగ్గించడంలో మాత్రం సబ్జా గింజల కంటే చియా గింజలు బెటర్ అని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది...